వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్, మలేసియాల ద్వైపాక్షిక సమావేశం

మలేసియా, తిమోర్- లెస్తే, మయన్మార్‌‌లతో వ్యవసాయ రంగ సహకారాన్ని పటిష్ఠపరుచుకున్న భారత్

వ్యవసాయ రంగంలో భాగస్వామ్యాల బలోపేతానికి మలేసియా, తైమోర్-లెస్తే, మయన్మార్‌‌లతో కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ద్వైపాక్షిక చర్చలు

వ్యవసాయ పరిశోధన, నూతన ఆవిష్కరణ, వాణిజ్యం, ఆహార భద్రతలలో ఆసియాన్ భాగస్వామ్య దేశాలతో సహకారానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్న భారత్

నాడు పోస్టు చేయడమైనది: 10 SEP 2026 11:04AM by PIB Hyderabad

మలేసియా వ్యవసాయఆహార భద్రత శాఖ మంత్రి శ్రీ మొహమ్మద్ బిన్ సాబూకేంద్ర వ్యవసాయరైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివ్‌రాజ్‌ సింగ్ చౌహాన్ నిన్నఅంటే 2026 సెప్టెంబరు 9న న్యూఢిల్లీలో సమావేశమయ్యారువ్యవసాయంఅటవీకరణ అంశాలపై 9వ ఆసియాన్భారత్ మంత్రుల స్థాయి సమావేశం (9వ ఏఐఎమ్ఎమ్ఏఎఫ్)ను వ్యవసాయ పరిశోధన విభాగం (డీఏఆర్ఈ), భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)ల ఆధ్వర్యంలో సెప్టెంబరు 8, 9 తేదీల్లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన సందర్భంలోనే మంత్రుల సమావేశం కూడా చోటుచేసుకుంది.

జ్ఞానంనైపుణ్యంఅత్యుత్తమ పద్ధతులను పంచుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇద్దరు మంత్రులూ స్పష్టం చేశారువ్యవసాయ రంగంలోదాని అనుబంధ రంగాల్లో పరస్పర ప్రయోజనాలు ముడి పడిన విషయాల్లో సహకరించుకోవడానికి ఒక సంస్థాగత ప్రాథమిక ప్రణాళికను అందించేందుకు అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూకుదుర్చుకొని సంయుక్త వ్యవసాయ పరిశోధనలుసాంకేతికతనూతన ఆవిష్కరణల రూపంలో సమన్వయాన్ని బలోపేతం చేసుకోవాలన్న ఆసక్తిని మంత్రులు వ్యక్తం చేశారువ్యవసాయందానితో సంబంధం కలిగిన అంశాల్లో భారత్మలేసియా మధ్య సన్నిహితపటిష్ఠ భాగస్వామ్యాన్ని ఇప్పటి కన్న దృఢతరం చేసుకోవడానికి పరస్పర సహకారాన్ని అందించుకుంటూ జెర్మ్‌ప్లాజమ్ మార్పిడివాణిజ్యంమార్కెట్టు లభ్యతలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలను పరిష్కరించుకోవడం సాధ్యమేనని వారు అన్నారు.

ఈ సమావేశంలో భారత్ తరఫున డీఏఆర్ఈ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎమ్.ఎల్జాట్డీఏఆర్ఈ అదనపు కార్యదర్శిఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ శ్రీ జ్ఞానేంద్ర దేవ్ త్రిపాఠీడీఓఏఎఫ్‌డబ్ల్యూ సంయుక్త కార్యదర్శి (ఐసీశ్రీ ఎ.కెసాహూతో పాటుఐసీఏఆర్‌కు చెందిన డీడీజీలుఐసీఏఆర్ ఏడీజీ ఐఆర్ డాక్టర్ నవీన్ పిసింగ్ సారథ్యంలోని అంతర్జాతీయ సంబంధాల బృందం సభ్యులు పాల్గొన్నారు.

భారత్తైమోర్-లెస్తే దేశాల ద్వైపాక్షిక సమావేశం

తైమోర్-లెస్తే దేశపు వ్యవసాయమత్స్యపరిశ్రమఅటవీకరణ శాఖ మంత్రి శ్రీ మార్కోస్ దా క్రూజ్ తో శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌ నిన్నఅంటే 2026 సెప్టెంబర్ 9.. న్యూఢిల్లీలో సమావేశమయ్యారువ్యవసాయంఅటవీకరణ అంశాలపై 9వ ఆసియాన్భారత్ మంత్రుల స్థాయి సమావేశం (9వ ఏఐఎమ్ఎమ్ఏఎఫ్)ను వ్యవసాయ పరిశోధన విభాగం (డీఏఆర్ఈ), భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)ల ఆధ్వర్యంలో సెప్టెంబరు 8, 9 తేదీల్లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన సందర్భంగాఈ సమావేశం చోటుచేసుకుంది.

వ్యవసాయ రంగంలో వివిధ సవాళ్లను పరిష్కరించడందేశ ఆహార భద్రతకు పూచీపడడానికి ఇరు పక్షాల మధ్య బలమైన సంస్థాగత యంత్రాంగాన్ని నిర్మించాలని తైమోర్ లెస్తే మంత్రి అన్నారువ్యవసాయ పరిశోధననూతన ఆవిష్కరణ పరంగా తైమోర్ లెస్తే సామర్థ్యాలను పెంపొందించడంలో సాయపడడానికి భారత్ ప్రభుత్వ అత్యుత్తమ పద్ధతులను పంచుకోవడానికి సిద్ధమని కేంద్ర వ్యవసాయరైతు సంక్షేమ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌ పునరుద్ఘాటించారుదీనికోసం శాస్త్రవేత్తలునిపుణుల మార్పిడితో పాటుమానవ వనరుల అభివృద్ధికి దోహదపడతామని ఆయన వివరించారు.

వ్యవసాయం, అటవీకరణపశుపోషణచేపలురొయ్యల పెంపకం రంగాల్లో క్షేత్ర స్థాయిలో సవాళ్లను అంచనా వేసిసాంకేతిక సిఫార్సులను అందించడానికి సాంకేతికశాస్త్రీయ నిపుణుల బృందాన్ని తైమోర్-లెస్తేకు పంపించే అంశాన్ని భారత్ పరిశీలించాలని కూడా ఆ దేశ మంత్రి సూచించారు.

ఈ సమావేశంలో భారత్ తరఫున డీఏఆర్ఈ కార్యదర్శిఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎమ్.ఎల్జాట్డీఏఆర్ఈ అదనపు కార్యదర్శిఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ శ్రీ జ్ఞానేంద్ర దేవ్ త్రిపాఠీడీఓఏఎఫ్‌డబ్ల్యూ సంయుక్త కార్యదర్శి (ఐసీశ్రీ ఎ.కెసాహూతో పాటుఐసీఏఆర్‌కు చెందిన డీడీజీలుఐసీఏఆర్ ఏడీజీ ఐఆర్ డాక్టర్ నవీన్ పిసింగ్ సారథ్యంలోని అంతర్జాతీయ సంబంధాల అధికారులు పాల్గొన్నారు.

భారత్మయన్మార్‌ల ‌ ద్వైపాక్షిక సమావేశం

మయన్మార్ వ్యవసాయ, పశుపోషణసాగునీటి శాఖ మంత్రి శ్రీ మిన్ నాంగ్‌తో శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌ నిన్నఅంటే 2026 సెప్టెంబర్ 9న న్యూఢిల్లీలో సమావేశమయ్యారువ్యవసాయంఅటవీకరణ అంశాలపై 9వ ఆసియాన్భారత్ మంత్రుల స్థాయి సమావేశం (9వ ఏఐఎమ్ఎమ్ఏఎఫ్)ను వ్యవసాయ పరిశోధన విభాగం (డీఏఆర్ఈ), భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)ల ఆధ్వర్యంలో సెప్టెంబరు 8, 9 తేదీల్లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన సందర్భంగాఈ సమావేశం చోటుచేసుకుంది.

మయన్మార్ మంత్రికి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య చాలా కాలంగా బలమైన సాంస్కృతికప్రజా సంబంధాలు ఉన్నాయని శ్రీ చౌహాన్ గుర్తు చేశారుసుమారు 1600 కిలోమీటర్ల సరిహద్దును భారత్‌తో పంచుకుంటున్న మయన్మార్ ఈ కారణంగా భారత్‌కు ఓ సన్నిహిత భాగస్వామిగా ఉందని శ్రీ చౌహాన్ అన్నారువ్యవసాయంతత్సంబంధిత రంగాల్లో రెండు దేశాల సహకారాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన అవగాహన ఒప్పందానికి తుది రూపురేఖలను ఖరారు చేసే ప్రక్రియ త్వరలో కొలిక్కి రానుందని మంత్రి అన్నారు.

రెండు దేశాల మధ్య వాణిజ్యావకాశాల గురించి ఇరు పక్షాలూ చర్చించాయి. పరస్పర అంగీకారం కుదిరిన రంగాల్లో బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోవడం వల్ల పప్పులుపత్తిపాడి అభివృద్ధివ్యవసాయ విద్య వంటి వ్యవసాయ సంబంధ ఉత్పాదనల వాణిజ్యాన్ని పెంపొందింప చేసుకోవడంలో ఉభయ పక్షాలకూ మేలు కలుగుతుందని గుర్తించారురెండు దేశాల మధ్య ఆర్థికవ్యావసాయిక సంబంధాలను బలపరుచుకోవడానికి దేశంలో పెట్టుబడికి తగిన అవకాశాలు కల్పించాలని మయన్మార్ పక్షం సలహా ఇచ్చింది.

ఈ సమావేశంలో భారత్ తరఫున డీఏఆర్ఈ కార్యదర్శిఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎమ్.ఎల్జాట్డీఏఆర్ఈ అదనపు కార్యదర్శిఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ శ్రీ జ్ఞానేంద్ర దేవ్ త్రిపాఠీడీఓఏఎఫ్‌డబ్ల్యూ సంయుక్త కార్యదర్శి (ఐసీశ్రీ ఎ.కెసాహూతో పాటుఐసీఏఆర్‌కు చెందిన డీడీజీలుఐసీఏఆర్ ఏడీజీ ఐఆర్ డాక్టర్ నవీన్ పిసింగ్ సారథ్యంలోని అంతర్జాతీయ సంబంధాల అధికారులు పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2308659) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada , Malayalam