బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉపరితల బొగ్గు, లిగ్నైట్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకం... దరఖాస్తులపై స్పష్టతనిచ్చిన మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 05 SEP 2026 11:22AM by PIB Hyderabad

ఉపరితల బొగ్గులిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహానికి ఉద్దేశించిన రూ. 37,500 కోట్ల పథకానికి ఎలాంటి దరఖాస్తులు రాలేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బొగ్గు మంత్రిత్వ శాఖ వాస్తవాలను వెల్లడించిందిఅలాంటి వార్తలు కేవలం అనాలోచితమైనవనిఅవి ఈ పథకం అసలు స్థితినిదరఖాస్తు ప్రక్రియను ప్రతిబింబించవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తోంది.

మే 13, 2026న రూ. 37,500 కోట్ల మొత్తం ఆర్థిక వ్యయంతో ఉపరితల బొగ్గులిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందిదేశంలో బొగ్గులిగ్నైట్ గ్యాసిఫికేషన్ అభివృద్ధిని వేగవంతం చేయటంసిన్‌గ్యాస్మిథనాల్అమ్మోనియాయూరియాతో సహా అధిక-విలువ గల ఉత్పత్తులుగా దేశీయ బొగ్గులిగ్నైట్ మార్పిడిని ప్రోత్సహించటం ఈ పథకం ఉద్దేశంఇలాంటి విలువైన ఉత్పత్తుల తయారీకి దేశీయ వనరుల వినియోగాన్ని మరింత పెంచటం ద్వారా ముడి పదార్థాల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించి... భారత ఇంధనఆర్థిక భద్రతను బలోపేతం చేసేందుకు ఈ పథకం దోహదపడుతుంది.

పథకానికి ఆమోదం లభించిన తర్వాత ప్రాజెక్టులను అభివృద్ధి చేసే అవకాశమున్న సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ నిరంతర ప్రచారంభాగస్వాములతో సంప్రదింపులను నిర్వహించిందిఇందులో భాగంగా న్యూఢిల్లీలో మే 28, 2026హైదరాబాద్‌లో జూన్ 11ముంబయిలో జూన్ 18, 2026న రోడ్‌షోలు జరిగాయిఈ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలుప్రభుత్వప్రైవేట్ రంగ సంస్థలుసాంకేతిక పరిజ్ఞాన నిపుణులుపెట్టుబడిదారులుఆర్థిక సంస్థలుఇతర భాగస్వాముల ప్రతినిధులను ఒకచోట చేర్చాయిఈ కార్యక్రమాలకు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారుఇది పథకంపై అవగాహన కల్పించటంలోపరిశ్రమల భాగస్వామ్యాన్ని సులభతరం చేయటంలో ప్రభుత్వానికున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

ఈ పథకం ద్వారా జూలై 7, 2026న ప్రతిపాదనలను కోరుతూ ఆహ్వాన పత్రం జారీ చేశారుదరఖాస్తుల సమర్పణకు ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించారుదరఖాస్తు చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులకు మరింత స్పష్టతను అందించేందుకు సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశాన్ని కల్పించటానికి జూలై 20, 2026న ముందస్తు దరఖాస్తు సమావేశాన్ని నిర్వహించారుదరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఈ సమావేశంలో పథకానికి సంబంధించిన వివిధ నిబంధనలుఅర్హతా ప్రమాణాలుదరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ప్రశ్నలపై స్పష్టతను కోరారుఆసక్తిగల భాగస్వాములు ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు సంబంధిత వర్గాలతో మంత్రిత్వ శాఖ నిరంతరం చర్చలు జరుపుతూనే ఉంది.

దరఖాస్తులను సమర్పించేందుకు మొదటి విడత గడువు తేదీ సెప్టెంబర్ 2026. కాబట్టిఈ దరఖాస్తుల ప్రక్రియ ముగిసే వరకు మొదటి విడతలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనేది ఖచ్చితంగా అంచనా వేయటంవెల్లడించటం సాధ్యం కాదుమొదటి విడత దరఖాస్తు గడువు కొనసాగుతుండగానే... ఈ పథకానికి అసలు దరఖాస్తులే రాలేదని నిర్ధారణకు రావటం సరికాదుఅది వాస్తవ పరిస్థితిని తెలియజేయదు.

భాగస్వాములతో జరిగిన చర్చల ఆధారంగా తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (టీఎఫ్‌ఎల్‌), ఎన్‌టీపీసీ లిమిటెడ్ దరఖాస్తులను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఇప్పటికే సమర్పించినట్లు మంత్రిత్వ శాఖకు సమాచారం అందిందిఈ పథకానికి 'ఎవరూ స్పందించడం లేదుఅనే వాదన సరైనది కాదని దీని ద్వారా స్పష్టమవుతోందిప్రాజెక్టు తయారీదరఖాస్తు రూపకల్పన వివిధ దశల్లో ఉన్న ఇతర ఆసక్తి గల దరఖాస్తుదారులతో కూడా మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోంది.

ఈ పథకం ద్వారా ఊహించిన ప్రాజెక్టుల భారీ పరిమాణంసంక్లిష్టతను దృష్టిలో ఉంచుకునిముందుగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు... ముందస్తు సాధ్యసాధ్యాల నివేదికల తయారీసాంకేతిక ప్రత్యామ్నాయాల అంచనాబొగ్గులిగ్నైట్ఇతర ముడిసరుకుల ఏర్పాట్ల గుర్తింపుప్రాజెక్టు ఆర్థిక వ్యవస్థను అంచనా వేయటంతో పాటు వివరణాత్మక ప్రాజెక్టు ప్రతిపాదనలను సిద్ధం చేయటం వంటి ముందస్తు తయారీ పనులను పూర్తి చేయాల్సి ఉంటుందికాబట్టి గడువు సమీపిస్తున్న కొద్దీ మరికొంత మంది దరఖాస్తుదారులు ప్రతిపాదనలను ఖరారు చేసి సమర్పించే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఈ పథకం ద్వారా పరిశ్రమలు పాల్గొనేలా పలు అవకాశాలు కల్పిస్తూదీన్ని రూపొందించారురోలింగ్ రౌండ్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందిఒక రౌండ్ కోసం దరఖాస్తు గడువు ముగిసిన వెంటనేతదుపరి రౌండ్ మరుసటి రోజే ప్రారంభమై రెండు నెలల పాటు దరఖాస్తుదారులకు అందుబాటులో ఉంటుందిప్రాజెక్టు తయారీకి అదనపు సమయం అవసరమయ్యే కంపెనీలుకేవలం మునుపటి రౌండ్లలో పాల్గొనలేకపోయినంత మాత్రాన అనర్హులు కాకూడదనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ఏర్పాటు చేశారుపెద్ద ఎత్తున చేపట్టే బొగ్గులిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు భారీ స్థాయిలో సన్నాహాలుపెట్టుబడులు అవసరం అవుతాయిఅందుకే ఈ రోలింగ్-రౌండ్ విధానాన్ని పొందుపరిచారు.

ఈ పథకంలో పరిశ్రమల నుంచి బలమైన భాగస్వామ్యం ఉంటుందని మంత్రిత్వ శాఖ ధీమాతో ఉందిఈ పథకం దాదాపు 25 ప్రాజెక్టుల్లో సుమారు రూ. 2.5 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని... సుమారు 50,000 ప్రత్యక్షపరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అంచనాఅలాగే 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ పథకం దోహదపడుతుంది.

ఈ పథకం అమలు ప్రారంభ దశలోనే ఉందనిమొదటి దశ దరఖాస్తు గడువు సెప్టెంబర్ 7, 2026 వరకు ఉంటుందని మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసిందిప్రక్రియ కొనసాగుతుండగానే ఈ పథకానికి ఎవరూ స్పందించలేదనటం సరికాదుముందస్తు అంచనాల ఆధారంగా కాకనిర్దేశిత దరఖాస్తు ప్రక్రియతదుపరి విడతలు పూర్తయిన తర్వాతే దీని విజయంభాగస్వామ్య స్థాయిని అంచనా వేయాలి.

ఈ పథకానికి పరిశ్రమల నుంచి నిరంతర భాగస్వామ్యం లభిస్తుందని మంత్రిత్వ శాఖ విశ్వాసం వ్యక్తం చేస్తుందిఇది భారతదేశంలో బొగ్గులిగ్నైట్ గ్యాసిఫికేషన్ అభివృద్ధికి ఊతమిస్తుంది.

 

****


(రిలీజ్ ఐడి: 2307103) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil , Kannada