పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కాన్పూర్‌లోని గంగా బ్యారేజ్ సమీపంలో ప్రమాదానికి గురైన టెక్నామ్ P2006T ట్విన్-ఇంజిన్ విమానం

నాడు పోస్టు చేయడమైనది: 27 AUG 2026 2:08PM by PIB Hyderabad

కాన్పూర్‌లోని 'గార్గ్ ఏవియేషన్ లిమిటెడ్సంస్థకు చెందిన 'టెక్నామ్ P2006T' (రిజిస్ట్రేషన్ నంబర్ VT-NBV) అనే ట్విన్-ఇంజిన్ విమానం ఈ రోజు మధ్యాహ్నం కాన్పూర్ సివిల్ విమానాశ్రయం నుంచి సుమారు నాటికల్ మైళ్ల దూరంలో గల గంగా బ్యారేజ్ సమీపంలో ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం అందింది.

ఆ విమానం కాన్పూర్ సివిల్ ఎయిర్‌ పోర్ట్ లోకల్ ఫ్లయింగ్ ఏరియాలో శిక్షణ విమానంగా ఉందివిమానంలో శిక్షణ పొందుతున్న ఒక పైలట్ఒక శిక్షకుడూ ఉన్నారుఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరూ మరణించారు.

అవసరమైన నియంత్రణ పర్యవేక్షణసమన్వయం కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు చెందిన ముగ్గురు అధికారుల బృందం ఆ ప్రాంతానికి బయలుదేరింది.

విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ)కు సమాచారం అందించారువర్తించే నిబంధనల ప్రకారం ప్రమాదంపై సమగ్ర ఈ సంస్థ దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తు ద్వారా ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులుకారణాలను నిర్ధారిస్తారు.

 

***


(రిలీజ్ ఐడి: 2303737) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Bengali-TR , Kannada