హోం మంత్రిత్వ శాఖ
దివ్యాంగ పురుషుల క్రికెట్ జట్టుతో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా భేటీ
దేశ గౌరవాన్ని పెంపొందింప చేసే దిశగా వారు చేసిన ప్రయత్నాలు,
వారి దృఢసంకల్పం భారత యువతకు స్ఫూర్తిదాయకం
‘2026 భారత్-ఇంగ్లాండ్ పురుషులు మిక్స్‌డ్ డిసబిలిటీ టీ20ఐ సిరీస్’కు ఇంగ్లాండ్ వెళ్లి
స్వదేశానికి తిరిగి వచ్చిన జట్టు
భవిష్యత్తులోనూ జట్టు రాణించాలని కోరుకుంటూ
జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
प्रविष्टि तिथि:
23 AUG 2026 9:25PM by PIB Hyderabad
భారత దివ్యాంగ పురుషుల క్రికెట్ జట్టుతో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ‘‘భారత దివ్యాంగ పురుషుల క్రికెట్ జట్టును న్యూఢిల్లీలో ఈ రోజు కలుసుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ‘2026 భారత్-ఇంగ్లాండ్ పురుషులు మిక్స్‌డ్ డిసబిలిటీ టీ20ఐ సిరీస్’లో పాల్గొనడానికి ఇంగ్లాండ్ వెళ్లిన జట్టు స్వదేశానికి తిరిగివచ్చింది. దేశానికి మరింత కీర్తిని సంపాదించి పెట్టే దిశగా వారు చేసిన ప్రయత్నాలు, వారు చాటిన దృఢ సంకల్పం భారత యువతకు స్ఫూర్తినిస్తాయి. రాబోయే కాలంలోనూ జట్టు రాణించాలని కోరుకుంటూ, జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశాను’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2302636)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam