హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన తమిళనాడు... మహాబలిపురంలో రేపు సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం
సహకార ప్రధాన సమాఖ్యవాదం ఆధారంగా ‘టీమ్ ఇండియా’ భావనను
దేశ ప్రజల ముందుకు తెచ్చారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ..
ఈ దిశగా జోనల్ కౌన్సిళ్లు గొప్ప తోడ్పాటును అందిస్తున్నాయి
బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని నిర్మిస్తాయన్న భావనతో
రెండు లేదా మూడు రాష్ట్రాలనో, కేంద్ర- రాష్ట్రాలనో ప్రభావితం చేస్తున్న అంశాలపై
మాటామంతీ, చర్చ కోసం వ్యవస్థీకృత యంత్రాంగాన్ని,
ముఖ్య వేదికను అందిస్తున్న జోనల్ కౌన్సిళ్లు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో,
చర్చా మాధ్యమం ద్వారా పరిష్కారాల సాధనకు శక్తిమంత మాధ్యమంగా మారిన జోనల్ కౌన్సిళ్ల సమావేశాలు
प्रविष्टि तिथि:
19 AUG 2026 2:35PM by PIB Hyderabad
సౌత్ జోనల్ కౌన్సిల్ (ఎస్‌జడ్‌సీ) 31వ సమావేశం తమిళనాడులోని మహాబలిపురంలో ఈ నెల 20న జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. సదరన్ జోనల్ కౌన్సిల్‌లో తమిళనాడు, కేరళమ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, అండమాన్ - నికోబార్ దీవులకు సభ్యత్వం ఉంది.
1956 నాటి రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని 15వ, 22వ సెక్షన్ల ప్రకారం సదరన్ జోనల్ కౌన్సిల్ సహా అయిదు జోనల్ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు. సదరన్ జోనల్ కౌన్సిల్‌కు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా చైర్మన్‌గానూ, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ సి. జోసెఫ్ విజయ్ వైస్ చైర్మన్‌గానూ ఉన్నారు. సభ్య రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు తలో సారి ఈ కౌన్సిల్‌కు వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తుంటారు. 31వ సమావేశాన్ని తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర హోం శాఖ అధీనంలోని ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో దక్షిణాదికి చెందిన సభ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాలు లెఫ్టినెంట్ గవర్నర్లు, పరిపాలకులతో పాటు ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సీనియర్ మంత్రులు పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర సీనియర్ అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు.
ప్రధాన కార్యదర్శుల స్థాయిలో ఓ స్థాయీ సంఘాన్ని కూడా జోనల్ కౌన్సిల్ నియమించింది. రాష్ట్రాలు ప్రస్తావించే అంశాలను మొదట జోనల్ కౌన్సిల్‌కు చెందిన స్థాయీ సంఘంలో చర్చకు నివేదించి, చర్చిస్తారు. ఆ తరువాత, మిగతా అంశాలను జోనల్ కౌన్సిల్ సమావేశం పరిశీలనకు అందిస్తారు.
సహకార పూర్వక సమాఖ్యవాదం ఆధారంగా ‘టీమ్ భారత్’ భావనను దేశ ప్రజల ఎదుటకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకువచ్చారు. ఈ దిశగా ప్రధాన తోడ్పాటును జోనల్ కౌన్సిళ్లు అందిస్తున్నాయి. రాష్ట్రాలు బలంగా ఉన్నప్పుడే దేశం బలంగా ఉంటుందనే భావనతో జోనల్ కౌన్సిళ్లు పనిచేస్తున్నాయి. ఈ కౌన్సిళ్లు రెండు లేదా అంతకన్న ఎక్కువ రాష్ట్రాలతో పాటు కేంద్రాన్నీ, రాష్ట్రాల్నీ ప్రభావితం చేసే అంశాలపై మాటామంతీని, చర్చని నిర్వహించడానికి వ్యవస్థిత యంత్రాంగాన్ని సమకూర్చడమే కాకుండా, దాని ద్వారా పరస్పర సహకారాన్ని పెంపొందింపచేసుకోవడానికి ఒక వేదికను కూడా అందిస్తాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, చర్చ ద్వారా పరిష్కారాలను కనుగొనడానికి ఒక శక్తిమంతమైన వేదికగా జోనల్ కౌన్సిల్ సమావేశాలు రూపొందాయి.
జోనల్ కౌన్సిళ్లు పోషించే పాత్ర ఏమిటంటే ప్రధానంగా సలహాలను ఇవ్వడం. ఏమైనప్పటికీ గత కొన్ని సంవత్సరాల్లో, ఈ కౌన్సిళ్లు వివిధ ప్రాంతాల మధ్య పరస్పర అవగాహన, సహకారం తాలూకు ఆరోగ్యదాయక బంధాన్ని పెంపొందించడంలో ఓ ముఖ్య కారకంగా మారాయి. గత సుమారు 12 సంవత్సరాల్లో అంటే, 2014 జూన్ మొదలు ఇప్పటివరకు.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాలు అందించిన సహకారంతో వివిధ జోనల్ కౌన్సిళ్లు, వాటి స్థాయీ సంఘాల సమావేశాలు కలుపుకొని మొత్తం 69 సమావేశాలను నిర్వహించారు.
కేంద్రం, సభ్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య, సభ్య రాష్ట్రాలు, సభ్య కేంద్రపాలిత ప్రాంతాల మధ్య వివాదాలను, అంశాలను పరిష్కరించడానికి ఒక చక్కని వేదికను జోనల్ కౌన్సిళ్లు సమకూరుస్తున్నాయి. జాతీయ ప్రాధాన్యం కలిగిన విస్తృత అంశాలపై కూడా ఈ కౌన్సిళ్లు చర్చిస్తాయి. చర్చాంశాల్లో మహిళలు, బాలలకు వ్యతిరేకంగా అత్యాచార కేసుల సత్వర దర్యాప్తు, వాటిని శీఘ్ర గతిన పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (ఎఫ్‌టీఎస్‌సీ)లు రంగంలోకి దిగడం, అలాగే విద్యకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర అంశాలు భాగంగా ఉన్నాయి. వీటికి తోడు, ప్రాంతీయ స్థాయిలో సామాన్య హితంతో ముడిపడిన వివిధ అంశాలు.. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన అంశాలు, నీళ్ల పంపకానికి సంబంధించిన ప్రధాన ప్రాజెక్టుల అంశాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్), పౌర విమానయానానికి సంబంధించిన అంశాలు, ఇతరత్రా అనేక అంశాలపై కూడా ఈ కౌన్సిళ్లు చర్చిస్తాయి.
***
(रिलीज़ आईडी: 2301212)
आगंतुक पटल : 6