కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిటల్ సహకారాన్ని, భవిష్యత్తు నెట్‌వర్కు టెక్నాలజీలను బలోపేతం చేయడానికి పూణేలో బ్రిక్స్ ఐసీటీ కార్యాచరణ బృందం ఏడో సమావేశానికి భారత్ ఆతిథ్యం


భారత్ సారథ్యంలోని ఇతివృత్తం ‘‘స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’’ అందిస్తున్న మార్గదర్శకత్వంలో సమావేశం ఏర్పాటు

ఈ సమావేశంలో ఏఐ, తర్వాతి తరం కమ్యూనికేషన్లు, ఇండస్ట్రీ 4.0, ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ (ఈఎంఎఫ్) ప్రభావం, డిజిటల్ ఎకోసిస్టమ్ ఏకీకరణపై బ్రిక్స్ దేశాల ప్రతినిధులు చర్చలు

प्रविष्टि तिथि: 17 AUG 2026 8:08PM by PIB Hyderabad

బ్రిక్స్‌కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఐసీటీలలో సహకారంపై ఏర్పాటు చేసిన బ్రిక్స్ కార్యాచరణ బృందం 7వ సమావేశం ఈ రోజు ప్రారంభమైంది. దీంతో సమాచార, ప్రసార సాంకేతిక పరిజ్ఞానాల్లో సహకారానికి సంబంధించిన బ్రిక్స్ ట్రాక్ సమావేశాలు మొదలయ్యాయి.

image.png

 

టెలికమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి శ్రీ అమిత్ అగర్వాల్ ఈ సమావేశాలను ప్రారంభించారు. ప్రతినిధి బృందాలకు స్వాగతం పలికారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఐసీటీ ట్రాక్ ఇతివృత్తమైన ‘‘పటిష్టమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణ, సహకారం, పరివర్తన (ఐసీటీ)’’, దాని నాలుగు ప్రధానాంశాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సభ్యదేశం ప్రారంభోపన్యాసం చేసింది.

image.png

 

ఈ సందర్భంగా టెలికమ్యూనికేషన్ల విభాగ కార్యదర్శి శ్రీ అమిత్ అగర్వాల్ మాట్లాడారు. ‘‘బ్రిక్స్ ఐసీటీ ట్రాక్ పరిధిలో ఒక ముఖ్యమైన భాగస్వామ్య వారానికి నేటి ప్రారంభోత్సవం నాంది పలుకుతోంది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న సహకార ప్రక్రియకు ఇది కొనసాగింపు. ఈ ఏడాది ఆరంభంలో బ్రిక్స్ ఐసీటీ అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. అప్పటి నుంచి వరుసగా కార్యాచరణ బృంద సమావేశాలు, ఇతివృత్త ఆధారిత వెబినార్లు, ప్రతిపాదనా పత్రాల పైన చర్చలతో సహా నిపుణులు, అధికారుల మధ్య క్రమం తప్పని సంప్రదింపుల ద్వారా మేం ఉమ్మడిగా పనిచేశాం. ఈ కార్యక్రమాలు మా అనుభవాలను పంచుకొనేందుకు, మా ప్రాధాన్యతలపై ఉమ్మడి అవగాహన పెంచుకొనేందుకు, ప్రస్తుతం మన ముందున్న ఎజెండాను సమిష్టిగా రూపొందించుకొనేందుకు వీలు కల్పించాయి" అని అన్నారు. 

బ్రిక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యూచర్ నెట్‌వర్క్స్ కౌన్సిల్ ఈ రోజు సమావేశమైంది. నిర్దేశిత జాతీయ శాఖల కార్యకలాపాలను సమీక్షించింది. అలాగే కృత్రిమ మేధ, అత్యాధునిక కమ్యూనికేషన్లు, ఇండస్ట్రీ 4.0లో ఇంటర్నెట్ అప్లికేషన్లు, విద్యుదయస్కాంత క్షేత్ర ప్రభావంపై అధ్యయన బృందాలు అందించిన తాజా సమాచారాన్ని కూడా సమీక్షించింది.

image.png

 

అనంతరం అధ్యక్ష దేశం నిర్దేశించిన చర్చనీయాంశాల పత్రంలోని ప్రాధాన్యాలను కార్యాచరణ బృందం పరిశీలించింది. అలాగే ప్రతి అంశం పరిధిలో చర్చించాల్సిన ప్రశ్నలను, సర్వే ప్రశ్నావళికి సభ్య దేశాల నుంచి అందిన సమాధానాలను క్రోఢీకరించి పరిశీలించింది. సభ్యదేశాలు సమర్పించిన ప్రాథమిక ప్రతిపాదనలను చర్చల కోసం స్వీకరించింది.

ఈ సమావేశాలు రేపు కూడా కొనసాగుతాయి. డిజిటల్ పౌర మౌలిక వసతులపై ఫోకస్ గ్రూపు సమావేశం, డిజిటల్ బ్రిక్స్ టాస్క్‌పోర్స్ సమావేశం రేపు జరుగుతాయి.

మరింత సమాచారం కోసం డీవోటీ హ్యాండిల్స్ ఫాలో అవండి: -

ఎక్స్ - https://x.com/DoT_India

ఇన్‌స్టా-  https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==

ఎఫ్‌బీ - https://www.facebook.com/DoTIndia

యూట్యూబ్: https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa

 

***


(रिलीज़ आईडी: 2300811) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Kannada , Malayalam