పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విశాఖపట్నంలో ప్రపంచ ఏనుగుల దినోత్సవం 2026 జాతీయ వేడుకలు; ఏనుగుల సంరక్షణ మరియు నిర్వహణకు చేసిన విశేష సేవలకు గాను గజ గౌరవ్ అవార్డులు 2026 ప్రదానం


ఏనుగుల సంరక్షణ అనేది విధానపరమైన అంశం కాదని, అది నాగరిక విలువలు మరియు పర్యావరణ సంరక్షణను చాటే భారతదేశ నిబద్ధత: కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్

మానవ-ఏనుగుల సంఘర్షణ ఘటనల పరిష్కారంలో ‘సంఘర్షణ నుంచి సహజీవనం’ అనేది రాష్ట్ర ప్రభుత్వ నినాదం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కె. పవన్ కళ్యాణ్

ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 23వ స్టీరింగ్ కమిటీ సమావేశానికి కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అధ్యక్షత వహించారు; 'మానవ-ఏనుగుల సంఘర్షణ: భారతదేశం అంతటా మారుతున్న పరిస్థితులు' అనే అంశంపై కార్యశాల నిర్వహణ

దక్షిణ భారతదేశంలో మానవ-ఏనుగుల సంఘర్షణను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి మరియు నిర్వహించడానికి ప్రాంతీయ కార్యాచరణ ప్రణాళిక విడుదల

प्रविष्टि तिथि: 13 AUG 2026 2:27PM by PIB Vijayawada

విశాఖపట్నంలో రోజు నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం 2026 జాతీయ వేడుకలకు కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి, శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదాల పవన్ కళ్యాణ్ విచ్చేశారు. కార్యక్రమంలో ఈఎఫ్సీసీ కార్యదర్శి శ్రీ తన్మయ్ కుమార్, అటవీ శాఖ డీజీ మరియు ప్రత్యేక కార్యదర్శి శ్రీ సుశీల్ కుమార్ అవస్థి, వన్యప్రాణి శాఖ ఏడీజీ శ్రీ రమేష్ పాండే, మంత్రిత్వ శాఖకు మరియు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు చెందిన సీనియర్ అధికారుల తో పాటుగా రైల్వే మంత్రిత్వ శాఖ, రాష్ట్ర అటవీ శాఖ, శాస్త్రీయ సంస్థలు, ఇతర భాగస్వామ్య సంస్థల అధికారులు కూడా పాల్గొన్నారు.

కేంద్ర సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఏనుగుల ఆవాసాలను పరిరక్షణకు ఏఐ, రిమోట్ సెన్సింగ్, జియోస్పేషియల్ మ్యాపింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను సాంప్రదాయ జ్ఞానంతో కలగలిపి వాటికి సుస్థిర భవిష్యత్తును కల్పించడంలో భారతదేశం ముందంజలో ఉందని ఆయన  పేర్కొన్నారు. స్థానిక సమాజాల క్షేమాన్ని నిర్ధారిస్తూనే, మానవ-ఏనుగుల సంఘర్షణను తగ్గించేందుకు వివిధ రంగాల సహాకారం, సమాజ భాగస్వామ్యం, శాస్త్రీయ విధానాల ఆవశ్యకతను మరింతగా వివరంగా చెప్పారు.

ఏనుగుల సంరక్షణ అనేది కేవలం ఒక విధానపరమైన అంశం కాదని, ఇది దేశ నాగరిక విలువలను, పర్యావరణ బాధ్యతను చాటే భారతదేశ నిబద్ధతని కేంద్ర సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ పేర్కొన్నారు. 33 ఏనుగుల అభయారణ్యాలు, శాస్త్రీయంగా గుర్తించిన 150 ఏనుగుల కారిడార్లు, ప్రపంచంలోని అటవీ ఆసియా ఏనుగుల జనాభాలో దాదాపు 60 శాతంతో భారతదేశం ఏనుగుల సంరక్షణలో అగ్రగామిగా కొనసాతుందని చెప్పారు. మానవ-ఏనుగుల సంఘర్షణ ఒక సంక్లిష్టమైన సమస్య అని, దీన్ని అధిగమించేందుకు వివిధ భాగస్వాముల తోడ్పాటుతో మరియు క్షేత్రస్థాయిలో శాస్త్రీయంగా  ధృవీకరించిన సమాచారాన్ని ఉపయోగించుకొని సమన్వయంతో కూడిన పరిష్కారాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని ఆయన తెలియజెప్పారు.

మానవ-ఏనుగుల సంఘర్షణ ఘటనలను పరిష్కరించడంలో 'సంఘర్షణ నుంచి సహజీవనం' అనేది రాష్ట్ర ప్రభుత్వ నినాదమని సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీనిని రాష్ట్రాల పరిపాలనా పరిమితులకు అతీతంగా ఒక ఉమ్మడి బాధ్యతగా పరిగణిస్తున్నామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అమలు చేస్తున్న హనుమన్ ( హీలింగ్ అండ్ నర్చూరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ అఫ్ వైల్డ్ లైఫ్) కార్యక్రమం గురించి, రాష్ట్రంలో వన్యప్రాణులను రక్షణకు ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విధంగా ఉపయోగిస్తూ, స్థానిక ప్రజానీకంతో ఎలా మమేకమవుతుందో, అలాగే అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది సామర్థ్యాన్ని పెంచేందుకు అనుసరిస్తున్న విధానాన్ని  ఉప ముఖ్యమంత్రి వివరించారు.

జాతీయ ఉత్సవాలలో భాగంగా, ఏనుగుల సంరక్షణ మరియు నిర్వహణకు చేసిన విశేష కృషికి గాను కేంద్ర సహాయ శ్రీ కీర్తి వర్ధన్ సింగ్గజ గౌరవ్ అవార్డులు 2026’ ను ప్రదానం చేశారు.

 

కార్యక్రమంలో '30 జెయింట్ స్టెప్స్' విడుదల ఒక ముఖ్యమైన విశేషం. ఇది 2020–2026 మధ్యకాలంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద చేపట్టిన 30 ప్రధాన మైలురాళ్లు, విజయాలు మరియు పరిరక్షణ కార్యక్రమాలను వివరిస్తుంది. ఏనుగులు, వాటి ఆవాసాలు, కారిడార్లను రక్షించడం, మానవ-ఏనుగుల సంఘర్షణను పరిష్కరించడం, బందీగా ఉన్న ఏనుగుల సంక్షేమాన్ని నిర్ధారించడం వంటి లక్ష్యాలతో 1992లో కేంద్ర ప్రాయోజిత పథకంగా ప్రారంభమైన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ మూడు దశాబ్దాలకు పైగా అంకితభావంతో కృషి చేసింది.

దక్షిణ భారతదేశంలో (కర్ణాటక, కేరళం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు) మానవ-ఏనుగుల సంఘర్షణను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు, నిర్వహించేందుకు రూపొందించిన మరొక ముఖ్యమైన ప్రాంతీయ కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద, దక్షిణాది ఏనుగుల ఆవాసాలు గల రాష్ట్రాలు, శాస్త్రీయ సంస్థలు, విషయ నిపుణులతో సంప్రదించి రూపొందించారు. ప్రాంతమంతటా గల మానవ-ఏనుగుల సంఘర్షణను పరిష్కరించేందుకు భూభాగ-స్థాయి విధానాన్ని ప్రణాళిక అవలంబిస్తోంది. భారత ప్రభుత్వం నుంచి రూ. 500 కోట్ల మద్దతుతో రూపొందించిన ప్రణాళిక, ఆవాసాల అనుసంధానం, కారిడార్ల పరిరక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సంఘర్షణ నివారణ మౌలిక సదుపాయాలు, ఆవాసాల పునరుద్ధరణ, సామాజిక భాగస్వామ్యం, పరిశోధన, పర్యవేక్షణ, వేగవంతమైన ప్రతిస్పందన యంత్రాంగాలు, సామర్థ్య నిర్మాణం, బలమైన అంతర్రాష్ట్ర సమన్వయంపై దృష్టి సారిస్తుంది.

భారతదేశంలో మూడు దశాబ్దాల ఏనుగుల సంరక్షణను పురస్కరించుకుని 'జర్నల్ ఆఫ్ వైల్డ్లైఫ్ సైన్స్' ఒక ప్రత్యేక సంచికను కూడా కార్యక్రమంలో విడుదల చేశారు. 'ప్రాజెక్ట్ ఎలిఫెంట్' కింద ఏనుగుల భవిష్యత్ నిర్వహణ, సంరక్షణకు మద్దతుగా, గత మూడు దశాబ్దాలుగా సేకరించిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మరియు పరిశోధనలను ప్రత్యేక సంచిక ఒకచోట చేర్చింది. మధ్య భారతదేశంలో ఏనుగుల విస్తరణ, స్థితి, మానవ-ఏనుగుల సంబంధాలపై ఒక ముఖ్యమైన చారిత్రక వివరణను అందించే '1947 సంవత్సరానికి ముందు మధ్య భారతదేశంలో ఆసియా ఏనుగులు' అనే మోనోగ్రాఫ్ను కూడా విడుదల చేశారు.

ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ 23 స్టీరింగ్ కమిటీ సమావేశం శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ అధ్యక్షతన విశాఖపట్నంలో జరిగింది. సమావేశంలో ఏనుగుల సంరక్షణ మరియు నిర్వహణలో ప్రస్తుత సమస్యలపై చర్చించడంతో పాటు, 'ది ట్రంపెట్', సంపుటి VI సంచిక 01; నీలగిరి ఏనుగుల రిజర్వ్ కోసం ఏనుగుల సంరక్షణ నమూనా ప్రణాళిక; 'బంధిత ఏనుగుల పెంపకం: విజ్ఞానం, సంక్షేమం మరియు ఆచరణ'; మరియు కేరళం, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్లలో మానవ-ఏనుగుల సంఘర్షణ అధ్యయనానికి సంబంధించిన రెండవ దశ వంటి కీలక ప్రచురణలను కార్యక్రమంలో విడుదల చేశారు. చొరవలు ఆధారాల సంరక్షణ, బంధిత ఏనుగుల సంక్షేమం మరియు విస్తృత ప్రాంత స్థాయిలో మానవ-ఏనుగుల సంఘర్షణ నిర్వహణను మరింత బలోపేతం చేస్తాయి.

మానవ-ఏనుగుల సంఘర్షణ: భారతదేశవ్యాప్తంగా విభిన్న పరిస్థితులుఅనే అంశంపై ఒక కార్యశాలను కూడా వేడుకల్లో భాగంగా నిర్వహించారు. ఇందులో ఏనుగుల సంచార రాష్ట్రాలకు చెందిన శాస్త్రీయ సంస్థలు, క్షేత్రస్థాయి ఏజెన్సీలు, నియంత్రణ అధికారులు పాల్గొన్నారు. శాస్త్రీయ ఆధారాలు, దీర్ఘకాలిక డేటాసెట్లు, క్షేత్రస్థాయి అనుభవాల ద్వారా మానవ-ఏనుగుల సంఘర్షణ స్థితి, పోకడలు, ప్రాంతీయ వైవిధ్యాలు వంటి విషయాలను కార్యశాలలో సమీక్షించారు. పశువైద్యపరమైన చర్యలు, విద్యుదాఘాతం, రైల్వే సంబంధిత ఏనుగుల మరణాల నివారణ, ఆవాసాలు మరియు కారిడార్ల నిర్వహణ, సమీకృత భూభాగ విధానాలతో పాటు సంఘర్షణ నివారణ కోసం వినూత్న విధానాలు, సాంకేతికతలు ఉత్తమ పద్ధతుల పై చర్చలను జరిపారు. మానవ-ఏనుగుల సహజీవనాన్ని ప్రోత్సహించేందుకు సమన్వయంతో కూడిన, శాస్త్రీయ ఆధారిత వ్యూహాల కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర అటవీ శాఖలు, పరిశోధనా సంస్థలు, భారతీయ రైల్వే, ఇతర భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలని కార్యశాలలో వివరించారు.

ప్రాజెక్ట్ ఎలిఫెంట్ దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా, నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ సహకారంతో దేశవ్యాప్తంగా ఒక భారీ అవగాహన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రచార కార్యక్రమంలో 21,450 పాఠశాలల నుంచి 20 లక్షలకు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఏనుగుల పర్యావరణ, సాంస్కృతిక ప్రాముఖ్యత, వాటి ఆవాసాలను పరిరక్షించాల్సిన ఆవశ్యకత గురించి పిల్లలకు అవగాహన కల్పించేందుకు పెయింటింగ్, మాస్క్-మేకింగ్ పోటీలు, ర్యాలీలు, వీధి నాటకాలు, అవగాహన, ప్రతిజ్ఞా కార్యక్రమాలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఏనుగులను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేసి, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణకు యువ రాయబారులుగా మారతామనే వారి నిబద్ధతను తెలియజేశారు.

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం 2026 వేడుకలు జాతీయ వారసత్వ జంతువైన ఏనుగు భవిష్యత్తును సురక్షితం చేసేందుకు, ఆరోగ్యకరమైన ఏనుగుల జనాభాను, స్థితిస్థాపక అటవీ ప్రకృతి దృశ్యాలను భవిష్యత్ తరాలు వారసత్వంగా పొందేలా, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణ, సామాజిక భాగస్వామ్యం, సమన్వయ చర్యల ద్వారా భారతదేశ దాని నిబద్ధతను తెలియజేస్తోంది.

 

*****


(रिलीज़ आईडी: 2299074) आगंतुक पटल : 48
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Tamil , Telugu , Malayalam