ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సంరక్షణ దిశగా భారత్ చేస్తున్న కృషిని ప్రస్తావించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
12 AUG 2026 1:37PM by PIB Hyderabad
ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, భారత పర్యావరణ వారసత్వంలో అంతర్భాగంగా ఉన్న మహా ఏనుగుల ఉత్సవాన్ని ఇవాళ నిర్వహించుకొంటున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసియా ఏనుగుల జాతిలో 60 శాతానికి పైగా భారత్‌లో మనుగడ సాగిస్తుండడం పట్ల ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు.
మన దేశంలో 33 అభయారణ్యాలు గజరాజులకు నిలయంగా ఉన్నాయనీ, దీర్ఘకాలిక ప్రాతిపదికన సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామనీ, ఇందులో అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, పశువైద్యులు, మావటులతో పాటు స్థానికులు కూడా కీలక పాత్ర పోషిస్తుండడం సంతోషదాయకమని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ఏనుగులు భారత పర్యావరణ వారసత్వంలో ఓ అంతర్భాగం. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏనుగుల ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రపంచమంతటా ఉన్న ఆసియా ఏనుగుల జాతిలో 60 శాతానికి పైగా ఏనుగులు భారత్‌లో ఉండటం సంతోషదాయకం. మన దేశంలో 33 అభయారణ్యాలు గజరాజులకు నిలయంగా ఉన్నాయనీ, దీర్ఘకాలిక ప్రాతిపదికన సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామనీ ఆయన తెలిపారు. ఈ ప్రయత్నాల్లో అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, పశువైద్యులు, మావటులతో పాటు స్థానికులూ కీలక పాత్ర పోషిస్తుండడం ఆనందకరం’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2298190)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam