ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నకిలీ, కల్పిత సమాచారాన్ని సమర్పించే దరఖాస్తుదారులపై నిషేధం విధించేందుకు కఠినమైన ఔషధ నిబంధనలను ప్రకటించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

प्रविष्टि तिथि: 06 AUG 2026 2:08PM by PIB Hyderabad

భారతదేశ ఔషధ నియంత్రణ వ్యవస్థ విశ్వసనీయతనుపారదర్శకతను బలోపేతం చేయటంలో భాగంగా అక్టోబర్ 16, 2025 నాటి జీ.ఎస్.ఆర్ నంబర్ 756 (ద్వారా డ్రగ్స్ నియమావళి-1945 సవరణలను కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940 ద్వారా ప్రస్తుతమున్న చట్టపరమైన నిబంధనలతో పాటు నూతనంగా ప్రకటించిన నిబంధనలు... దరఖాస్తుల్లో నకిలీతప్పుడు సమాచారాన్ని అందించే సంస్థల నుంచి తదుపరి దరఖాస్తులను నిషేధించే అధికారాన్ని లైసెన్సింగ్ అథారిటీకి కల్పిస్తాయిడ్రగ్స్ నియమావళి-1945లోని వివిధ నిబంధనల ద్వారా సమర్పించే అన్ని దరఖాస్తులకు ఇది వర్తిస్తుంది.

తప్పుడు డేటా ఉన్న దరఖాస్తులను తిరస్కరించటంఇప్పటికే ఉన్న లైసెన్సులను రద్దు చేయటం వంటి చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయిఈ సవరణ ద్వారా సంబంధిత రాష్ట్రకేంద్ర నియంత్రణ సంస్థ వద్ద నిర్దిష్ట కాలపరిమితి వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అనర్హులుగా ప్రకటించవచ్చుశిక్షతో కూడిన చర్యలు తీసుకునే ముందు షోకాజ్ నోటీసు జారీ చేయటం ద్వారా సరైన ప్రక్రియను నిర్దేశించారుఅప్పీలు చేసుకునే అవకాశం కూడా కల్పించారు.

దరఖాస్తుదారులు సమర్పించే శాస్త్రీయమైన ఆధారాలే ఔషధాల నాణ్యతభద్రతసమర్థతల నియంత్రణ మూల్యాంకనానికి ప్రాతిపదికగా నిలుస్తాయినకిలీకల్పిత డేటాను సమర్పించటం వల్ల నియంత్రణ ప్రక్రియ సమగ్రత దెబ్బతింటుందిఔషధాల నాణ్యతపై అనుమానాలను కల్పిస్తుందిప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందిఅటువంటి తప్పుడు ప్రకటనలను అరికట్టేందుకుదరఖాస్తుదారుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకుఔషధాల ఆమోదాలు విశ్వసనీయంగాశాస్త్రీయంగా చెల్లుబాటు అయ్యే ఆధారాలతో ఉండేలా చూసేందుకు ప్రస్తుత సవరణను చేశారు.

భారత నియంత్రణ వ్యవస్థను ప్రపంచ స్థాయి ప్రమాణాలకనుగుణంగా బలోపేతం చేయటానికి ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగమే ఈ ప్రకటనదేశంలో అమలయ్యే నిబంధనలకు కట్టుబడి ఉండే ఔషధ తయారీదారులుపంపిణీదారులను ప్రోత్సహించటంఅక్రమాలను అరికట్టటం దీని ప్రధాన ఉద్దేశంఇది పర్యవేక్షణను మెరుగుపరచటంనైతిక పద్ధతులను ప్రోత్సహించటంనిబంధనలను ఉల్లంఘించే వారిపై తగిన చర్యలు తీసుకోవటంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. ఔషధ రంగంలో కొనసాగుతున్న సంస్కరణలకు మరింత ఊతమిస్తుంది.

జీ.ఎస్‌.ఆర్‌.కు సంబంధించిన పూర్తి వివరాలు భారత ప్రభుత్వ అధికారిక గెజిట్ (-గెజిట్)లో అందుబాటులో ఉన్నాయిఈ వెబ్‌సైట్‌  https://egazette.gov.in/WriteReadData/2026/275233.pdf ద్వారా కూడా చూడవచ్చు.

 

***


(रिलीज़ आईडी: 2295587) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Tamil , Malayalam