రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతితో భేటీ అయిన ఉజ్బెకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రి

प्रविष्टि तिथि: 03 AUG 2026 3:02PM by PIB Hyderabad

ఈ రోజు (2026 ఆగస్టు 3) రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ముతో ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్ విదేశీ వ్యవహారాల మంత్రి సైదోవ్ బక్తియోర్ ఒదిలోవిచ్ సమావేశమయ్యారు.

రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ఒదిలోవిచ్‌కూఆయన ప్రతినిధి బృందానికీ రాష్ట్రపతి స్వాగతం పలికారుప్రాచీన వాణిజ్య మార్గాల ఆధారంగా ఏర్పడిన బలమైన చారిత్రకసాంస్కృతికనాగరిక సంబంధాలను భారత్ఉజ్బెకిస్థాన్ పంచుకుంటున్నాయన్నారుద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని వాస్తు కళభాషఆహారంసంగీతంమత సంప్రదాయాల్లో ఉన్న ఉమ్మడి వారసత్వం మరింత బలోపేతం చేస్తోందన్నారు.

రెండు దేశాల వ్యాపార సంస్థలకు ఒకరి మార్కెట్లపై మరొకరికి పెరుగుతున్న విశ్వాసాన్నిఉజ్బెక్ ప్రతినిధి బృందంలో ఉన్నత స్థాయి నాయకుల భాగస్వామ్యంపర్యటన సందర్భంగా నిర్వహించిన భారత్–ఉజ్బెకిస్థాన్ బిజినెస్ ఫోరం ప్రతిబింబిస్తున్నదని రాష్ట్రపతి అన్నారుమైనింగ్ రంగంలో ముఖ్యంగా అరుదైన ఖనిజాలువ్యవసాయంఫార్మాసూటికల్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో భారత్ఉజ్బెకిస్థాన్ మధ్య సహకారానికి ఉన్న అపారమైన అవకాశాల గురించి వివరించారు.

మన ఐటీఈసీ శిక్షణ కోర్సులుఇతర ఉపకార వేతన కార్యక్రమాల ద్వారా ఉజ్బెకిస్థాన్‌కు చెందిన 3,000 మందికి పైగా అధికారులునిపుణులువిద్యార్థులు ప్రయోజనం పొందినందుకు రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారుఅదే సమయంలో ఉజ్బెకిస్థాన్‌లో 16,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారువారు రెండు దేశాల మధ్య స్నేహానికి ప్రతీకగా నిలుస్తూ పరస్పర అవగాహననుబలమైన ప్రజా సంబంధాలను పెంపొందిస్తున్నారని రాష్ట్రపతి అన్నారు.

ఈ పర్యటన సందర్భంగా చేపట్టిన చర్చలు రెండు దేశాల మధ్య ఉన్న స్నేహసంబంధాలనూవిశ్వాసాన్నీసహకారాన్నీ మరింత బలోపేతం చేస్తాయని నాయకులిద్దరూ అంగీకరించారు.  

 

***


(रिलीज़ आईडी: 2293823) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Tamil , Malayalam