ప్రధాన మంత్రి కార్యాలయం
‘2026 కామన్వెల్త్ గేమ్స్’లో డెకాథ్లాన్ పోటీ కాంస్య పతక విజేత తేజస్విన్ శంకర్‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
01 AUG 2026 8:43AM by PIB Hyderabad
గ్లాస్గోలో ‘2026 కామన్వెల్త్ గేమ్స్’ పురుషుల డెకాథ్లాన్ పోటీలో కాంస్య పతకాన్ని గెలిచిన తేజస్విన్ శంకర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
తేజస్విన్ శంకర్ పది పోటీల్లోనూ అసాధారణ ఆటతీరును కనబరిచారని ప్రధానమంత్రి ప్రశంసించారు.
ఈ విజయాన్ని సాధించినందుకు తేజస్విన్ శంకర్‌ను శ్రీ మోదీ అభినందిస్తూ, రాబోయే కాలంలో కూాడా ఆయన నిరంతరాయంగా రాణించాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘భారతీయ క్రీడాకారులు చరిత్రను సృష్టిస్తూ, మన దేశ గౌరవాన్ని పెంపొందింపచేస్తున్నారు.
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల డెకాథ్లాన్ పోటీలో కాంస్య పతకాన్ని తేజస్విన్ శంకర్ గెలుచుకున్నారు. పది పోటీల్లోనూ ఆయన అసాధారణ ఆటతీరును కనబరిచారు. ఆయనకు అభినందనలు. ఆయన ఇదే విధంగా రాణిస్తూ ఉండాలి. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2293133)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Malayalam