ఆయుష్
azadi ka amrit mahotsav

మీరాబాయి చానూకు అర్జున పురస్కారం ఇవ్వాలని కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ సిఫార్సు


చాను సాధించిన అద్భుత క్రీడా విజయాలను గుర్తిస్తూ కేంద్ర క్రీడల శాఖ మంత్రికి శ్రీ జాదవ్ లేఖ

प्रविष्टि तिथि: 31 JUL 2026 4:40PM by PIB Hyderabad

భారత ప్రముఖ వెయిట్‌లిఫ్టర్ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చానూకు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు కేటాయించాలని కేంద్ర ఆయుష్ (స్వతంత్ర హోదా)వైద్యకుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ గణపత్‌రావ్ జాదవ్ కోరారు. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలుక్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయకు ఆయన లేఖ రాశారు. 

లేఖలో మీరాబాయి చానూ సాధించిన అసాధారణ విజయాలనుభారతీయ వెయిట్‌లిఫ్టింగ్ రంగానికి ఆమె అందించిన అత్యుత్తమ సేవలను  కేంద్ర మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ ప్రస్తావించారు. మణిపూర్‌కు చెందిన ఈ క్రీడాకారిణి కామన్వెల్త్ క్రీడల్లో అద్భుతమైన ప్రదర్శనలతో చరిత్ర సృష్టించి దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నారు. 

కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా స్వర్ణ పతకాలు సాధించిన మీరాబాయి చానూ అద్భుతమైన రికార్డును కేంద్రమంత్రి కొనియాడారు. ఆయా పోటీల్లో ప్రతిసారీ భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా ఆమె నిలిచారని గుర్తుచేశారు. 48 కేజీల విభాగంలో స్నాచ్క్లీన్ అండ్ జెర్క్ఆల్‌రౌండ్ విభాగాల్లో అత్యధిక బరువులు ఎత్తి రికార్డులు తిరగరాసిన తీరును మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. 

మీరాబాయి చానూ ఇప్పటికే ఒలింపిక్ పతకంతో పాటు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నపద్మశ్రీ వంటి దేశ అత్యున్నత క్రీడా పురస్కారాలను అందుకున్నారని కేంద్ర మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ గుర్తుచేశారు. మణిపూర్‌లోని తన గ్రామంలో శిక్షణ ప్రారంభించిన తొలి రోజుల్లో ఏర్పడిన అర్జున అవార్డు తీసుకోవాలనే ఆమె చిన్ననాటి కల మాత్రం ఇప్పటికీ నెరవేరకుండానే ఉండిపోయిందని అన్నారు. 

ఈ ప్రతిపాదనను పరిశీలించాలని కేంద్ర యువజన వ్యవహారాలుక్రీడల మంత్రిని కోరుతూ.. మీరాబాయి చానూను అర్జున అవార్డుతో సత్కరించడం ద్వారా ఆమె అసాధారణ ప్రతిభకుభారతీయ క్రీడలకు అందించిన అమూల్యమైన సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని శ్రీ ప్రతాప్‌రావు జాదవ్ తెలిపారు. 

మణిపూర్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి ప్రయాణం ప్రారంభించి దేశపు అత్యంత ప్రతిభావంతులైన వెయిట్‌లిఫ్టర్లలో ఒకరిగా ఎదిగిన చానూ ప్రయాణం ఆమె పట్టుదలనిరంతర కృషిఅంకితభావానికి ప్రత్యక్ష నిదర్శనమని మంత్రి కొనియాడారు. ఆమె విజయాలు లక్షలాది మంది యువ భారతీయులకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని చెప్పారు.

 

***


(रिलीज़ आईडी: 2292631) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Malayalam