ప్రధాన మంత్రి కార్యాలయం
థానేలో భవనం కూలిన ఘటనలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి దిగ్భ్రాంతి
ఎక్స్-గ్రేషియాను ప్రకటించిన ప్రధాని
प्रविष्टि तिथि:
31 JUL 2026 1:08PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని థానేలో భవనం కూలిన ఘటనలో ప్రాణ నష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ విషాద ఘటన గురించి విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయినట్లు ప్రధానమంత్రి చెప్పారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మరణించిన వారి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్‌ఎఫ్) నుంచి రూ.2 లక్షల ఎక్స్-గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయాన్ని అందిస్తారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
‘‘మహారాష్ట్రలోని థానేలో భవనం కూలిన ఘటనలో ప్రాణనష్టం జరిగిందని విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షల ఎక్స్-గ్రేషియాను అందిస్తాం. గాయపడిన వారికి రూ.50,000 అందజేస్తాం.’’
***
(रिलीज़ आईडी: 2292597)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam