ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాల్దీవులు, భారత్ మధ్య ఫవారా- యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రారంభం


మాల్దీవుల నుంచి మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా భారత్‌లోని యూపీఐ అనుసంధానిత బ్యాంకు ఖాతాలకు తక్షణ నిధుల బదిలీకి అవకాశం

प्रविष्टि तिथि: 31 JUL 2026 1:35PM by PIB Hyderabad

మాల్దీవుల తక్షణ చెల్లింపుల వ్యవస్థ ‘ఫవారా’భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐఅనుసంధానం విజయవంతంగా పూర్తయినట్లు మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ (ఎంఎఏప్రకటించింది. 2026 జూలై 30 నుంచి ఈ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి.

మాల్దీవులుభారత్ మధ్య జరిగే డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో,  ద్వైపాక్షిక ఆర్థిక సహకారంలో ఇది ఒక కీలక ముందడుగుగా నిలిచింది.

ఈ పరిణామంలోని ముఖ్య అంశాలు..

1.      తక్షణ నిధుల బదిలీ: మాల్దీవుల్లో ఉన్న వ్యక్తులు ఫవారా వ్యవస్థ ద్వారా భారత్‌లోని లబ్ధిదారులకు క్షణాల్లో డబ్బులు పంపవచ్చుఈ లావాదేవీలు మాల్దీవియన్ రుఫియా (ఎంవీఆర్రూపంలో ప్రారంభమైభారత్‌లోని ఖాతాదారులకు భారతీయ రూపాయిల (ఐఎన్ఆర్రూపంలో జమ అవుతాయి.

2.      తొలి విడత బ్యాంకుల భాగస్వామ్యం: ఈ సేవలు రెండు స్థానిక బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ పీఎల్‌సీమాల్దీవ్స్ ఇస్లామిక్ బ్యాంకు పీఎల్‌సీ భాగస్వామ్యంతో ప్రారంభమయ్యాయిఈ బ్యాంకుల వినియోగదారులు తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లుఫవారా చెల్లింపుల వ్యవస్థ ద్వారా భారత్‌లోని యూపీఐ ఖాతాలకు నేరుగా వ్యక్తి నుంచి వ్యక్తికి (పీ2పీబదిలీలు చేయవచ్చు.

3.      అనుమతించిన కేటగిరీలు: కుటుంబ ఖర్చుల కోసం విదేశాలకు డబ్బు పంపడానికీతీసుకోవడానికీ అనుమతిస్తారునిబంధనల మేరకు బహుమతి రూపంలోనూ అనుమతిస్తారు.

4.      సమష్టి విజయం: మాల్దీవ్స్ మానిటరీ అథారిటీరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్), ఇరు దేశాల ఆర్థిక సంస్థలుఇతర భాగస్వాముల సన్నిహిత సహకారంతో ఈ విధానం అమల్లోకి వచ్చింది.

నేపథ్యంభవిష్యత్తు కార్యాచరణ

ఎన్ఐపీఎల్ఎంఎంఏ మధ్య జూలై 2025లో ఈ ఫవారా-యూపీఐ అనుసంధాన ఒప్పందం కుదిరిందికేవలం 10 రోజుల సమయంలోనే టెస్టింగ్సర్టిఫికేషన్ఆన్‌బోర్డింగ్ప్రత్యక్ష తనిఖీలను పూర్తి చేసి ఈ చెల్లింపుల వ్యవస్థను వినియోగంలోకి తెచ్చారు.

ఈ భాగస్వామ్యం ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని రెండు దేశాల మధ్య డిజిటల్ చెల్లింపు సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారుదీనిలో భాగంగా క్యూఆర్ కోడ్ ఆధారిత వర్తకుల చెల్లింపులతో పాటు ఇతర నూతన డిజిటల్ సేవలను ప్రవేశపెట్టనున్నారుఈ చర్యలు మాల్దీవులు-భారత్ మధ్య ఆర్థికవ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నాయి.

ప్రస్తుతం యూపీఐని అనుమతిస్తున్న 9 దేశాలు

భారతీయ పర్యాటకులు విదేశాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా డిజిటల్ చెల్లింపులు చేసుకోవడానికి దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయిఅవి కాంబోడియాసింగపూర్యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ఫ్రాన్స్మారిషస్నేపాల్భూటాన్ఖతార్శ్రీలంక.

 

***


(रिलीज़ आईडी: 2292575) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Tamil , Malayalam