వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాల్దీవులకు కర్ణాటక నీలమ్, తోతాపురి మామిడిపళ్లు..


విమానంలో ఎగుమతి.. సాయపడిన అపెడా

నేరుగా ప్రపంచ మార్కెట్టుతో అనుబంధం.. రైతులకు 50 శాతానికిపైగా అధిక ప్రతిఫలం

प्रविष्टि तिथि: 31 JUL 2026 12:15PM by PIB Hyderabad

నీలమ్తోతాపురి రకాల మామిడిపళ్లను కర్ణాటక నుంచి మాల్దీవులకు మొదటిసారిగా విమానంలో ఎగుమతి చేయడానికి అగ్రికల్చరల్ప్రాసెస్‌డ్ ఫూడ్ ప్రాడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ.. ‘అపెడా’సహకరించిందికర్ణాటకలో సీజను దాటాక వచ్చే ఈ రకాలకు చెందిన మామిడి పండ్ల ఎగుమతి కార్యక్రమాన్ని నిన్న.. అంటే 2026 జులై 30న ప్రారంభించారుఈ రెండు రకాల మామిడి పండ్లను అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేయడాన్ని ప్రోత్సహించడంలోనూభారత మామిడిపండ్ల ఎగుమతుల్ని మరింత విస్తరించడంలోనూ ఈ కార్యక్రమం ఓ కీలక ఘట్టంగా నిలిచింది.
సరుకు ఎగుమతి కార్యక్రమాన్ని అపెడా చైర్మన్ఐఏఎస్ అధికారి శ్రీ అభిషేక్ దేవ్ ప్రారంభించారుదీనికి వెన్నుదన్నుగా నిలిచిన ఎగుమతి సంస్థనీఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ (ఎఫ్‌పీసీ)నీరైతుల్నీమిగతా ఆసక్తిదారుల్నీ ఆయన అభినందించారుఇలాంటి కార్యక్రమాలు భారతదేశ మామిడిపండ్లకు మార్కెట్ లభ్యతను పెంచుతాయనీఆలస్యంగా పండే రకాలకు ఎగుమతి అవకాశాల్ని అందించడంతో పాటు రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా తోడ్పడాయనీ శ్రీ అభిషేక్ దేవ్ అన్నారు.
కర్ణాటక.. కోలార్ జిల్లాలో కేజీఎఫ్ తాలూకాకు చెందిన ప్రాకృతిక్‌ మాయా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీతో కలిసి పనిచేస్తున్న రైతుల వద్ద నుంచి ఒక మెట్రిక్ టన్ను నీలమ్తోతాపురీ మామిడి పండ్ల ఎగుమతి సరుకును సేకరించారుఈ సరుకును అహల్య దేవి వెంచర్స్ డైరెక్టరు శ్రీమతి .అశ్వినీ ఆధ్వర్యంలో ఎగుమతి చేశారుశ్రీమతి .అశ్వినీ కొత్తగా నమోదైన మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తఎగుమతిదారుభారత వ్యవసాయ ప్రధాన ఎగుమతుల విస్తారిత అనుబంధ వ్యవస్థలో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం అంతకంతకూ పెరుగుతోందని ఈ ఎగుమతి కార్యక్రమం చాటిచెబుతోంది.
నీలమ్ మామిడిపండ్లు తీయదనానికీరసాన్నిచ్చే గుజ్జుకీచక్కనైన సువాసనకీ పేరు పొందాయివీటిని మిఠాయిలుస్మూదీలుపానీయాల తయారీకి కూడా ఉపయోగిస్తారుతోతాపురీ మామిడిపండ్లు తీపిపులుపు రుచుల కలగలుపుగా ఉండి నేరుగా వాడుకోవడానికీశుద్ధి చేసి వాడటానికీ అనువైనవని ప్రసిద్ధి చెందాయిజూన్ చివరి నుంచి జులై చివరి వరకు కోతకు వచ్చిఆలస్యంగా పండే ఈ రకాలు భారత్ మామిడిపండ్ల ఎగుమతి కాలాన్ని పొడిగించడానికీపీక్ హార్వెస్ట్ పీరియడ్ ముగిసిన తరువాతి కాలంలోనూ అంతర్జాతీయ డిమాండును తీర్చే అవకాశాల్ని అందిస్తున్నాయి.
విమానం ద్వారా ఎగుమతి కర్ణాటకలో ఉద్యాన రంగం ఎగుమతి సామర్థ్యం అంతకంతకూ పెరుగుతోందని స్పష్టం చేస్తోందిఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు సంఘటిత పద్ధతినాణ్యమైన ఉత్పత్తిఎగుమతి ప్రధాన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసిరైతుల్ని అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడానికి దోహదం చేస్తున్నాయని కూడా ఈ ఎగుమతి కార్యక్రమం స్పష్టం చేసింది.
ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీతో అనుబంధం కలిగి ఉన్న రైతులు ఈ ఎగుమతి కార్యక్రమం ద్వారా సాంప్రదాయిక మార్కెట్ల కన్నా 50 శాతానికి పైగా ప్రతిఫలాన్ని పొందగలిగారుసరుకును నేరుగా కొనుగోలు చేయడంఎగుమతి మార్కెట్లతో పరిచయాలుసంఘటిత పద్ధతిని అనుసరించడం వల్ల సమకూరే ప్రయోజనాలను ఈ ఘటన సూచిస్తోందిఈ ఎగుమతి కార్యక్రమం రైతుల ఆదాయాన్ని పెంచుతూఎగుమతి ప్రధాన సాగు పద్థతులను పెద్ద ఎత్తున అనుసరించేలా ప్రోత్సాహాన్ని కూడా అందిస్తుంది.
కర్ణాటక మామిడిపండ్ల ఎగుమతుల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ఈ ఎగుమతి కార్యక్రమంతో ఆరంభమైందిదీనితో అధిక నాణ్యత కలిగిన ఉద్యానవన ఉత్పాదనలను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించడంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీఓలు), ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు (ఎఫ్‌పీసీలు), ఎగుమతిదారులువ్యవసాయ రంగ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇదివరకటి కన్నా ఎక్కువగా పాలుపంచుకొనేటట్లు ప్రోత్సాహం లభించగలదని భావిస్తున్నారు.

ఎగుమతులకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనను బలోపేతం చేయడానికీఅంతర్జాతీయ మార్కెట్ల వరకూ చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేయడానికీఅధిక నాణ్యత కలిగిన భారత పండ్లకు అంతర్జాతీయ మార్కెట్లలో ఆదరణ లభించేలా చూడటానికీ రాష్ట్ర ప్రభుత్వాలుఎగుమతిదారులుఎఫ్‌పీఓలుఎఫ్‌పీసీలుఇతర ఆసక్తిదారులతో ‘అపెడా’ కలిసి పనిచేస్తుందిఇలాంటి కార్యక్రమాలు రైతులకీతోటపంటల రంగానికీ సుస్థిర అవకాశాలను అందజేయడంతో పాటు భారతదేశ వ్యవసాయ ఎగుమతుల విస్తరణకు కూడా తోడ్పడతాయి.

 

***


(रिलीज़ आईडी: 2292573) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Gujarati , Urdu , Bengali , Tamil , Kannada