పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నకిలీ ఎయిర్ సువిధ 2.0 వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన

నాడు పోస్టు చేయడమైనది: 25 JUL 2026 3:59PM by PIB Hyderabad

ఎయిర్ సువిధ 2.0 పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, పోర్టళ్లు చలామణిలోకి వచ్చాయని, అవి ప్రయాణికులను పేమెంట్ గేట్‌వేలకు మళ్ళించడం ద్వారా వారిని తప్పుదోవ పట్టిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

ఎయిర్ సువిధ 2.0 సేవలు పూర్తి ఉచితమని, స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎయిర్ సువిధ 2.0 కి సంబంధించిన ఏకైక అధికారిక పోర్టల్: https://airsuvidha.civilaviation.gov.in/

 

ప్రయాణికులు తమ వ్యక్తిగత వివరాలను లేదా ప్రయాణ సమాచారాన్ని పంచుకునే ముందు వెబ్‌సైట్ యూఆర్ఎల్ ను జాగ్రత్తగా సరిచూసుకోవాలని, ఎయిర్ సువిధ 2.0 సేవలను అందిస్తున్నామని చెప్పే ఎలాంటి అనధికారిక వెబ్‌సైట్లలోనూ చెల్లింపులు చేయవద్దని మంత్రిత్వశాఖ విజ్ఞప్తి చేసింది.

 

ప్రయాణికులు అధికారిక పోర్టల్‌ను మాత్రమే ఉపయోగించాలని, ప్రామాణికమైన సమాచారం కోసం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని కోరింది.

 

ప్రయాణికుల అవగాహన, ప్రజా భద్రత దృష్ట్యా ఈ ప్రకటన జారీ చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2289453) సందర్శకుల సూచీ సంఖ్య : : 50
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Malayalam