సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దేశ టీవీ వీక్షకుల లెక్కింపు వ్యవస్థలో పారదర్శకత, స్వతంత్రత, జవాబుదారీతనాన్ని పటిష్టం చేసేలా టెలివిజన్ రేటింగ్ పాలసీ 2026
నికర విలువ ఆవశ్యకతను తగ్గించిన కొత్త విధానం... మీటర్లు కలిగిన గృహాల విస్తరణ, కాలానుగుణ సంస్థల సర్వేలకు శ్రీకారం
విశ్వసనీయమైన టీవీ వీక్షకుల లెక్కింపును నిర్ధారించేందుకు స్వతంత్ర ఆడిట్లు, క్రాస్-హోల్డింగ్ పరిమితులు, దశలవారీ జరిమానాలు తప్పనిసరి
నాడు పోస్టు చేయడమైనది:
24 JUL 2026 3:50PM by PIB Hyderabad
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) దేశంలో టెలివిజన్ రేటింగ్‌లను నియంత్రించడానికి సమగ్ర మార్గదర్శకాలతో కూడిన టీవీ రేటింగ్స్ పాలసీ 2026ను విడుదల చేసింది. టీవీ రేటింగ్ సేవలను అందించే ఏజెన్సీల నమోదు, నిర్వహణ, ఆడిటింగ్, పర్యవేక్షణకు సంబంధించి పారదర్శకత, స్వతంత్రత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ విధానం స్పష్టమైన ప్రమాణాలను నిర్దేశించింది.
ఈ కొత్త టీవీ రేటింగ్ పాలసీ 2026 గతంలో 2014 జనవరి 16 నుంచి అమల్లో ఉన్న టీవీ రేటింగ్ ఏజెన్సీల మార్గదర్శకాల స్థానంలో రూపుదిద్దుకుంది.
ఈ నూతన విధానం ద్వారా తీసుకువచ్చిన ప్రధాన సంస్కరణలు..
1. నికర విలువ నిబంధనను రూ. 20 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు తగ్గించడం,
2. కనెక్టెడ్ టీవీలు, ఓటీటీ వేదికల్లో అందుబాటులో ఉండే టీవీ ఛానెళ్లతో సహా పలు వేదికల్లో ఏ ఒక్క సాంకేతికతకూ ప్రాధాన్యం ఇవ్వని వీక్షకుల లెక్కింపు విధానం,
3. మీటర్లు కలిగిన ఇళ్ల సంఖ్యను 50,000 నుంచి 80,000కు విస్తరించడం ద్వారా నమూనా పరిమాణాన్ని పెంచడం,
4. ప్రతి మూడేళ్లకు ఒకసారి క్రమానుగత సంస్థలు సర్వేలను నిర్వహించడం,
5, వీక్షకుల డేటా గణన నుంచి ల్యాండింగ్ పేజీల తొలగింపు,
6. వార్షిక స్వతంత్ర ఆడిట్లు,
7. నిబంధనల ఉల్లంఘనలపై దశలవారీ జరిమానాల వ్యవస్థ అమలు.
రేటింగ్ ఏజెన్సీల క్రియాశీలక, కార్యచరణ స్వతంత్రతను నిర్ధారించడానికి క్రాస్-హోల్డింగ్ పరిమితులు, ఏజెన్సీ బోర్డులో కనీసం 33 శాతం మంది స్వతంత్ర దర్శకులు ఉండాలనే నిబంధన, ప్రయోజనాల ఘర్షణకు దారితీసే కన్సల్టెన్సీ లేదా అడ్వైజరీ కార్యకలాపాలపై నిషేధం, సెక్యూరిటీ క్లియరెన్స్ నిబంధనలు, అలాగే ఆడిట్,పారదర్శకతకు సంబంధించిన బాధ్యతలను రక్షణ చర్యలుగా నిర్దేశించారు.
ఈ నూతన విధానం ప్రకారం దేశంలో టీవీ రేటింగ్‌ల వ్యాపారంలో ఉన్న ఏ సంస్థ అయినా కొన్ని అదనపు నిబంధనలను పాటించడంతో పాటు, కొత్త పాలసీ కింద నమోదు చేసుకోవడం తప్పనిసరి.
నేటి వరకు ఈ కొత్త విధానం కింద ఏ సంస్థ కూడా నమోదు కాలేదు. టీవీ రేటింగ్ సేవలను అందించడానికి నమోదు చేసుకునే ఏజెన్సీల సంఖ్యపై టెలివిజన్ రేటింగ్స్ విధానం 2026 ఎలాంటి పరిమితులను విధించలేదు.
రాజ్యసభలో ఎంపీ డాక్టర్ జాన్ బ్రిట్టాస్ అడిగిన నక్షత్రం గుర్తు లేని ప్రశ్నకు సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2289099)
సందర్శకుల సూచీ సంఖ్య : : 41
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam