ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చంద్రశేఖర్ ఆజాద్ జయంతి... శ్రద్ధాంజలి అర్పించిన ప్ర‌ధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 JUL 2026 8:22AM by PIB Hyderabad

చంద్రశేఖర్ ఆజాద్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. చంద్రశేఖర్ ఆజాద్ నిర్భయత్వాన్ని, ధైర్య సాహసాల్ని, తిరుగులేని దేశభక్తిని చాటి భారతదేశ స్వాతంత్య్రక సమర చరిత్రలో గౌరవాన్విత స్థానాన్ని సొంతం చేసుకున్నారని ప్రధానమంత్రి ప్రశంసించారు.

 

దేశ సేవకు అంకితం అయ్యేటట్లు లెక్కలేనంత మంది యువ భారతీయులకు స్ఫూర్తిని చంద్రశేఖర్ ఆజాద్ అందించారని, ఆయన దృఢ సంకల్పం ప్రతి ఒక్క తరానికి ప్రేరణనిస్తూ ఉంటుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆయన నిర్భయత్వం, ధైర్య సాహసాలు, తిరుగులేని దేశభక్తి భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రకు గర్వకారణం. దేశ సేవకు అంకితం అయ్యే స్ఫూర్తిని అసంఖ్యాక యువ భారతీయులకు అందించారాయన. చంద్రశేఖర్ ఆజాద్ సంకల్పం తరాల తరబడి ప్రేరణను ఇస్తూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.


 

***

MJPS/SS/PRK


(రిలీజ్ ఐడి: 2288181) సందర్శకుల సూచీ సంఖ్య : : 52