సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అశ్లీల కంటెంట్, ఐటీ చట్టం, సంబంధిత నిబంధనల ఉల్లంఘనలు... గత రెండేళ్లలో 50 ఓటీటీ వేదికలపై సస్పెన్షన్ వేటు
నాడు పోస్టు చేయడమైనది:
22 JUL 2026 3:15PM by PIB Hyderabad
డిజిటల్ మీడియాలోని సమకాలీన విషయాలను ప్రచురించే ప్రచురణర్తలు, ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్ పబ్లిషర్లను (ఓటీటీ వేదికలు) నియంత్రించేందుకు ప్రభుత్వం ఐటీ చట్టం 2000 కింద సమాచార సాంకేతికత (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ప్రవర్తనా నియమావళి) నిబంధనలు 2021ను ఫిబ్రవరి 25, 2021న నోటిఫై చేసింది.
ఈ నిబంధనలలోని మూడో విభాగం డిజిటల్ వార్తా ప్రచురణకర్తలు, ఓటీటీ వేదికల కోసం ఒక నైతిక నియమావళిని నిర్దేశిస్తుంది. వచ్చిన ఫిర్యాదులను ఐటీ నిబంధనలు 2021 నిబంధనల ప్రకారమే పరిష్కరిస్తారు.
చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడానికి లేదా నిలిపివేయడానికి ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79(3)(బీ) మధ్యవర్తులకు నోటీసులు ఇచ్చే అధికారాన్ని కల్పిస్తుంది.
ఫిర్యాదుల ఆధారంగా ఇటువంటి మధ్యవర్తులు, ఓటీటీ వేదికలపై ప్రభుత్వం క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. అశ్లీల కంటెంట్ ప్రదర్శించడం, ఐటీ చట్టంలోని సెక్షన్ 67, 67ఏ, బీఎన్ఎస్ సెక్షన్ 294, 1986 నాటి స్త్రీల అసభ్యకర వర్ణన, ప్రదర్శన (నిషేధ) చట్టంలోని సెక్షన్ 4లను ఉల్లంఘించినందుకు గత రెండేళ్లలో 50 ఓటీటీ వేదికలను భారత్ లోప్రజలకు అందుబాటులో లేకుండా ప్రభుత్వం రద్దు చేసింది.
లోక్‌సభలో శ్రీ రాజభౌ పరాగ్ ప్రకాష్ వాజే అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ నేడు లిఖితపూర్వక సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 2287986)
సందర్శకుల సూచీ సంఖ్య : : 35