రాజ్యసభ సచివాలయం
కొత్తగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చాంబర్‌లో ఈ రోజు ప్రమాణం చేయించిన రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్
నాడు పోస్టు చేయడమైనది:
20 JUL 2026 1:55PM by PIB Hyderabad
కొత్తగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన తొమ్మిది మంది సభ్యులతో రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు రాజ్యసభ చాంబర్‌లో పదవీప్రమాణం చేయించారు. ప్రమాణాన్ని స్వీకరించిన వారిలో డాక్టర్ ముకేశ్‌భాయి జె. రాఠ్వా, శ్రీ పవన్ ఖేరా, శ్రీ మహేశ్ కేవట్, శ్రీ జేమ్స్ పంగ్‌సాంగ్ కోంగ్కల్ సంగ్మా, శ్రీ ఖియాంగ్తే లాల్టులువాంగ్‌కిమా, డాక్టర్ సతీశ్ పూనియా, శ్రీ ప్రకాశ్ చిక్ బరైక్, సుష్మితా దేవ్, శ్రీ సుఖేందు శేఖర్ రే ఉన్నారు.
ఐదుగురు సభ్యులు హిందీలో, ఇద్దరు ఇంగ్లిషులో, మరో ఇద్దరు బెంగాలీలో ప్రమాణ పాఠాన్ని చదివారు. వీరిలో ముగ్గురు సభ్యులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారు కాగా గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, మిజోరమ్, రాజస్థాన్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2286652)
సందర్శకుల సూచీ సంఖ్య : : 49
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam