ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
40 మిలియన్ల డౌన్‌లోడ్లను దాటిన ఆధార్ యాప్... సులువైన డిజిటల్ గుర్తింపు సేవలకు ఊతం
ఆధార్ యాప్ ద్వారా దాదాపు 49 లక్షల మంది పౌరుల మొబైల్ నంబర్ల అప్‌డేట్..11.65 లక్షల మంది చిరునామాల అప్‌డేట్
బయోమెట్రిక్స్ లాక్, అన్‌లాక్ చేయడానికి 19 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు ఆధార్ యాప్‌ను ఉపయోగించిన పౌరులు
प्रविष्टि तिथि:
18 JUL 2026 3:55PM by PIB Hyderabad
ఆధార్ యాప్ 40 మిలియన్ల (4 కోట్లు) డౌన్‌లోడ్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. సులువైన, డిజిటల్ విధానంలో లభించే గుర్తింపు సేవలపై పౌరులకు పెరుగుతున్న నమ్మకాన్ని ఈ విజయం స్పష్టం చేస్తోంది.
ఆధార్ యాప్ వినియోగం నిరంతరం పెరగడం, ఇంటి వద్ద కూర్చుని సౌకర్యవంతంగా చిరునామా మార్చుకోవడం, మొబైల్ నంబర్ అప్‌డేట్, ఈమెయిల్ అప్‌డేట్, బయోమెట్రిక్ లాక్, అన్‌లాక్ ఫీచర్లతో పాటు ఈ-ఆధార్ డౌన్‌లోడ్ వంటి విస్తృత శ్రేణి సేవలను ఈ యాప్ ద్వారా పొందే వీలుంది. ఇలాంటి వివిధ రకాల ఆధార్ సేవలను పొందేందుకు ఆధార్ యాప్ ఒకే చోట లభించే డిజిటల్ వేదికగా అవతరించిందనే విషయాన్ని తెలియజేస్తోంది.
ఈ యాప్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 11.65 లక్షల చిరునామా మార్పులను విజయవంతంగా పూర్తి చేసింది. పౌరులు ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే తమ ఆధార్ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడానికి ఇది ఎంతగానో తోడ్పడింది.
దాదాపు 49 లక్షల మొబైల్ నంబర్ల అప్‌డేట్లను కూడా ఈ యాప్ సులభతరం చేసింది. దీనివల్ల పౌరులు తమ ఆధార్‌తో అనుసంధానించిన సంప్రదింపు సమాచారాన్ని ఖచ్చితత్వంతో ఉంచుకోవడానికి వీలవుతుంది.
జూలై 1వ తేదీన ఈమెయిల్ అప్‌డేట్ ఫీచర్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఆధార్ యాప్ ద్వారా సుమారు 12.5 లక్షల ఈమెయిల్ ఐడీలు కొత్తగా నమోదు చేసుకున్నారు లేదా అప్‌డేట్ చేసుకున్నారు. అవసరమైన చోట పౌరులకు, యుఐడీఏఐ మధ్య కమ్యూనికేషన్‌ను ఇది మరింత బలోపేతం చేసింది. గతంలో ఈ ఈమెయిల్ అప్‌డేట్ సేవకు రూ. 75 ఫీజు వసూలు చేసేవారు. అయితే ఇప్పుడు ఆధార్ యాప్‌లో 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు దీనిని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.
ఆధార్ యాప్‌లోని గోప్యత, భద్రతా ఫీచర్లను పౌరులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా పౌరులు తమ బయోమెట్రిక్ లాక్,అన్‌లాక్ సదుపాయాన్ని 19.1 మిలియన్ల (1.91 కోట్లు) కంటే ఎక్కువ సార్లు ఉపయోగించారు. ఈ ఫీచర్ పౌరులు తమ వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణ కలిగి ఉండేలా సాధికారతను కల్పిస్తుంది. కేవలం కొన్ని ట్యాప్‌ల ద్వారా అవసరమైనప్పుడల్లా తమ బయోమెట్రిక్స్‌ను తక్షణమే లాక్ లేదా అన్‌లాక్ చేసుకునే వీలు కల్పిస్తూ అదనపు భద్రతను అందిస్తుంది.
ఆధార్ కలిగిన పౌరులు తమ గుర్తింపును సౌకర్యవంతంగా, గోప్యతకు మొదటి ప్రాధాన్యతనిచ్చే విధానంలో ప్రదర్శించడానికి, పంచుకోవడానికి, ధ్రువీకరించుకోవడానికి వీలుగా ఆధార్ యాప్ రూపొందించారు. వికసిత్ భారత్ కోసం ఉద్దేశించిన డిజిటల్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడంలో ఇది అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2286121)
आगंतुक पटल : 15