ప్రధాన మంత్రి కార్యాలయం
స్కైరూట్ ఏరోస్పేస్‌కు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
అంతరిక్ష వాహక నౌక విక్రమ్-1 ప్రయోగాన్ని వీక్షించాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి పిలుపు
प्रविष्टि तिथि:
18 JUL 2026 9:54AM by PIB Hyderabad
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు అంతరిక్ష వాహక నౌక ‘విక్రమ్-1’ తొలి కక్ష్య ప్రయోగానికి సిద్ధమైన సందర్భంగా స్కైరూట్ అంతరిక్ష సంస్థకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రయోగం దేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని అభివర్ణించారు. దేశ నూతన అంతరిక్ష ఆకాంక్షలకు, దేశంలో పెరుగుతున్న ఆవిష్కరణలు, సాంకేతికత, పారిశ్రామిక సామర్థ్యానికి విక్రమ్-1 ప్రయోగం ఒక నిదర్శనమని ప్రశంసించారు.
ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించాలని దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పోస్టు చేశారు.
దేశ అంతరిక్ష రంగ చరిత్రలో ఇదొక చారిత్రక నూతన అధ్యాయం.
దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందిన తొలి అంతరిక్ష వాహక నౌక విక్రమ్-1 ప్రయోగాన్ని ఈ రోజు ఉదయం 11:30 గంటలకు స్కైరూట్ అంతరిక్ష సంస్థ చేపడుతోంది.
నాలుగు దశలతో కూడిన ఈ అత్యాధునిక రాకెట్గ్ ను ఉపగ్ర హాలను వేగంగా, అత్యవసర డిమాండ్‌కు అనుగుణంగా అంతరిక్షంలోకి చేర్చేలా ప్రత్యేకంగా రూపొందించారు. ఈ చారిత్రక మిషన్ మన యువతలోని అసాధారణ ప్రతిభను, పట్టుదలను, పారిశ్రామిక స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెబుతోంది. తాము అంతరిక్ష రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు నూతన ఆవిష్కరణలకు, సరికొత్త వ్యాపార విస్తరణకు ఎటువంటి సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయో కూడా ఇది స్పష్టం చేస్తోంది.
విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి సరికొత్త చరిత్ర సృష్టించాలని, సరికొత్త ఆవిష్కర్తల తరానికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తూ మొత్తం స్కైరూట్ అంతరిక్ష బృందానికి నా శుభాకాంక్షలు.
దేశ ప్రజలందరూ, ముఖ్యంగా యువ మిత్రులు ఈ చారిత్రక ప్రయోగాన్ని వీక్షించాలి. సామాజిక మాధ్యమాల్లో #IndiaWithVikram1 అనే హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగిస్తూ స్కైరూట్ బృందానికి మద్దతు తెలపాలని, వారి విజయాన్ని ఆకాంక్షించాలని కోరుతున్నాను.
***
(रिलीज़ आईडी: 2286114)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam