ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎకనామిక్ రోడ్‌మ్యాప్ వాణిజ్య సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 09 JUL 2026 10:09AM by PIB Hyderabad

అందరికీ నమస్కారం!

ఇవాళ్టి ఈ సభ భారత్ఆస్ట్రేలియాల వాణిజ్య బలంఆకాంక్షలకు సాక్ష్యంగా నిలుస్తోందిమీరు ఈ సమావేశానికి హాజరవటం మన పరస్పర విశ్వాసాన్నిఉమ్మడి ఆశయాలను ప్రతిబింబిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల అనిశ్చిత పరిస్థితులుసరఫరా వ్యవస్థలకు అంతరాయంఇంధన సంక్షోభం తలెత్తాయిఇలాంటి పరిస్థితుల్లో భారత్ఆస్ట్రేలియా సన్నిహితవిశ్వసనీయ భాగస్వాములుగా ముందుకు సాగటం అత్యంత అవసరం.

కొన్నేళ్లుగా రెండు దేశాల సామర్థ్యాలను వినియోగించుకుంటూ భవిష్యత్తు భాగస్వామ్యానికి అవసరమైన కీలక ఆధారాన్ని ఏర్పరచుకున్నాం. 2022లో రికార్డు సమయంలో పూర్తయిన ఆర్థిక సహకారవాణిజ్య ఒప్పందం (ఈసీటీఏమన ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిందిఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆస్ట్రేలియాకు భారతదేశ ఎగుమతులు రెట్టింపయ్యాయిఅలాగే మెరుగైన మార్కెట్ అవకాశాల ద్వారా ఇరుదేశాలు వాణిజ్య లాభాలను పొందాయి.

ఇక్కడితో మనం ఆగిపోకూడదుసమగ్ర సీఈసీఏ ఒప్పందం దిశగా మనం అడుగులు వేస్తున్నాంఈ ప్రయత్నాల ద్వారా ఇరుదేశాల ప్రభుత్వాలు సరికొత్త మార్గాన్ని సిద్ధం చేశాయి.

ఇప్పుడు ఈ సరికొత్త మార్గం ద్వారా పెట్టుబడులుఆవిష్కరణలు వృద్ధి చెందుతాయిఈ భాగస్వామ్యాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైనే ఉంది.

మిత్రులారా,

ఇవాళ స్వచ్ఛ ఇంధన రంగానికి చెందిన పలు కంపెనీలు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాయిభారతదేశంలో హైడ్రో ప్రాజెక్టులుగ్రీన్ హైడ్రోజన్సోలార్ మాడ్యూల్స్పవన విద్యుత్ రంగాల కోసం ఒక బలమైన తయారీ వ్యవస్థను నిర్మిస్తున్నాం.

2030 నాటికి 500 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, 2070 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందిఆస్ట్రేలియా సాంకేతికతపెట్టుబడులువనరులు ఈ పరివర్తనను మరింత వేగవంతం చేయగలవు.

కొన్ని నెలల కిందటే శాంతి చట్టం ద్వారా అణు ఇంధన రంగాన్ని భారత్ ప్రైవేట్ కంపెనీలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. 2047 నాటికి 100 జీడబ్ల్యూ అణు ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాంఆస్ట్రేలియాలో ఉన్న విస్తారమైన యురేనియం నిల్వలకుభారతదేశ అణు ఇంధన ప్రయాణానికి ప్రత్యక్ష సంబంధం ఉందిఈ ముఖ్యమైన రంగంలో ఇరుదేశాలు సహకారాన్ని విస్తరించుకోవటానికి ఇదొక అద్భుతమైన అవకాశం.

భారతదేశంలో ఓడరేవులువిమానాశ్రయాలురహదారులురైల్వేలుపట్టణ మౌలిక సదుపాయాల రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునే ఆస్ట్రేలియా పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలున్నాయిప్రస్తుతం భారతదేశంలో రోజుకు దాదాపు 34 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందిరోజూ కిలోమీటర్లకు పైగా రైల్వే ట్రాక్‌లను నిర్మిస్తున్నారుఇది పరిమాణంవేగంస్థిరత్వాల అద్భుతమైన కలయికకు నిదర్శనం.

ఉక్కు రంగంలో మనం ఇప్పటికే బలమైన భాగస్వాములుగా ఉన్నాంప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముడి ఉక్కు ఉత్పత్తిదారుగా భారత్ ఉందితక్కువ కార్బన్ అల్యూమినియంగ్రీన్ ఐరన్క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో మనం కలిసి పనిచేయవచ్చు.

ఏఐ మిషన్క్వాంటం మిషన్సెమీ కండక్టర్ ప్రోగ్రాం ద్వారా భారత ప్రభుత్వం 10 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించిందిప్రపంచ స్థాయి పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు డేటా సెంటర్లుఏఐక్వాంటం టెక్నాలజీస్సెమీ కండక్టర్స్డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో మనం కలిసి పని చేయవచ్చు.

ఆస్ట్రేలియా పెన్షన్ ఫండ్లు నేడు ట్రిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆస్తులను నిర్వహిస్తున్నాయిభారతదేశంలో పెన్షన్ పొదుపులను విశ్వసనీయంగా భావిస్తారుమేం వాటిని కేవలం పెట్టుబడిగా మాత్రమే భావించలేం... లక్షలాది కుటుంబాల నమ్మకంగా భావిస్తాంమీ ఫండ్లు సురక్షితమైనస్థిరమైన వృద్ధిని సాధించటానికి భారత్ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందిమీ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయటంమీ పెట్టుబడి వృద్ధి చెందటానికి సహాయపడటమే మా ప్రయత్నం.

విద్యనైపుణ్యాల రంగాల్లో ఇరుదేశాల మధ్య పరస్పర బంధం ఉందిడీకిన్ యూనివర్సిటీవోలోంగాంగ్ యూనివర్సిటీలు గిఫ్ట్ సిటీలో క్యాంపస్‌లను ప్రారంభించికొత్త అధ్యాయానికి నాంది పలికాయిఇది భారతదేశంపై వాటికున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందివిద్యార్థుల వలసలను ఒక ప్రతిభావంతమైన భాగస్వామ్యంగా మార్చటమే మన ఉమ్మడి లక్ష్యం కావాలి.

మిత్రులారా,

ఈ అన్ని రంగాల్లో మనం ముందుకు సాగాలంటే మరో ముఖ్యమైన అంశంపై దృష్టి సారించాలిమన భాగస్వామ్యం కేవలం రెండు రాజధానులు లేదా కొన్ని నగరాలకే పరిమితం కాకూడదుమన రాష్ట్రాలుచిన్నపెద్ద నగరాలువిశ్వవిద్యాలయాలుపరిశ్రమలు వీటన్నింటినీ భాగస్వాములుగా మార్చాలి.

వెస్ట్రన్ ఆస్ట్రేలియా కీలక ఖనిజాల బలాన్ని ఒడిశాగుజరాత్ రాష్ట్రాల్లోని తయారీ రంగ సామర్థ్యాలతో అనుసంధానించవచ్చుక్వీన్స్‌లాండ్టాస్మేనియాకు చెందిన స్వచ్ఛ ఇంధనంవ్యవసాయ రంగ నైపుణ్యాలు... పంజాబ్తమిళనాడుఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పునరుత్పాదక ఇంధన కారిడార్లకుఆహార శుద్ధి వ్యవస్థలకు ఊతమిస్తాయి.

న్యూ సౌత్ వేల్స్విక్టోరియా రాష్ట్రాల్లోని ఆర్థికవిద్యవైద్య సాంకేతికతఆవిష్కరణల రంగాలు... మహారాష్ట్రకర్ణాటకతెలంగాణ రాష్ట్రాలతో కలిసి పనిచేయటం ద్వారా ప్రపంచ స్థాయి పరిష్కారాలను కనిపెట్టవచ్చుసౌత్ ఆస్ట్రేలియాలోని రక్షణఅంతరిక్షంతయారీ రంగాలు... ఉత్తరప్రదేశ్కేరళ రాష్ట్రాల భాగస్వామ్యంతో సరికొత్త అవకాశాలను సృష్టించగలవు.

రాబోయే రోజుల్లో మనం కొన్ని నిర్దిష్టమైన రాష్ట్రాల మధ్యరంగాల మధ్య భాగస్వామ్యాలను గుర్తించివాటిని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందించాలని సూచిస్తున్నా.

మిత్రులారా,

ప్రజాస్వామ్య విలువలుఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల ఇరుదేశాలకున్న ఉమ్మడి దృక్పథం ఆధారంగా మన మధ్య బలమైన వ్యూహాత్మక అనుసంధానం ఏర్పడిందిమన వాణిజ్య భాగస్వామ్యాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు మేం కట్టుబడి ఉన్నాంఈ ప్రయత్నంలో మీ పాత్ర కీలకమైనది.

ఇవాళ్టి చర్చలు నూతన ఆలోచనలకునూతన భాగస్వామ్యాలకునూతన నిర్ణయాలకు దారి తీస్తాయని విశ్వసిస్తున్నాను.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గౌరవ ప్రధానమంత్రికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

అందరికీ నా శుభాకాంక్షలు.

ధన్యవాదాలు.

గమనికఇది ప్రధానమంత్రి ప్రసంగానికి స్వేచ్ఛానువాదంఅసలు ప్రసంగం హిందీలో ఇచ్చారు.

 

***


(रिलीज़ आईडी: 2283374) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , हिन्दी , English , Urdu , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam