యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028 కోసం జూలై 15 లోగా క్రీడాకారుల అర్హత, ఎంపిక విధానాలను ప్రకటించాలి: జాతీయ క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడల శాఖ


పారదర్శకంగా ఒలింపిక్ అర్హత, ఎంపిక ప్రమాణాలు

प्रविष्टि तिथि: 09 JUL 2026 5:32PM by PIB Hyderabad

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడలకు సంబంధించి క్రీడాకారుల అర్హతఎంపిక విధానాన్ని వెల్లడించాలని గుర్తింపు పొందిన అన్ని జాతీయ క్రీడా సమాఖ్యలకు (ఎన్‌ఎస్‌ఎఫ్‌కేంద్ర యువజన వ్యవహారాలుక్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిందిక్రీడాకారుల ఎంపిక కోసం అనుసరించే ఖచ్చితమైన ప్రమాణాలుప్రక్రియతో కూడిన సమగ్ర వివరాలను జూలై 15 లోగా ప్రకటించాలని ఆదేశించింది.

ఒలింపిక్స్పారాలింపిక్స్ఆసియా క్రీడలుపారా ఆసియా క్రీడలుకామన్వెల్త్ క్రీడలు వంటి అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు సంబంధించిన ఎంపిక విధానంప్రమాణాలను.. ఆయా క్రీడలు ప్రారంభం కావడానికి కనీసం రెండు సంవత్సరాల ముందే ప్రచారం చేయాలని స్పష్టం చేసిందిఈ వివరాలను సంబంధిత జాతీయ క్రీడా సమాఖ్యల అధికారిక వెబ్‌సైట్లలో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది.

 

ఈ ఎంపిక విధానంనిబంధనలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని జాతీయ క్రీడా సమాఖ్యల పరిధిలోని సభ్య విభాగాలకుభారత క్రీడా ప్రాధికార సంస్థకు (ఎస్‌ఏఐఖచ్చితంగా చేరవేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

 

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడలు 2028 జూలై 14న ప్రారంభమై అదే నెల 30న ముగియనున్నాయి.

 

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన అర్హత మార్గదర్శకాలను ఆయా అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు ఇప్పటికే విడుదల చేశాయని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించిందిక్రీడాకారులుఆసక్తి గల వారు ఈ వివరాలను ఒలింపిక్స్ అధికారిక వెబ్‌సైట్ లింకు https://www.olympics.com/ioc/documents/olympic-games/los-angeles-2028-olympic-games ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది.

 

ఈ అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా తాము అనుసరించబోయే ఒలింపిక్ అర్హతక్రీడాకారుల ఎంపిక విధానంఖచ్చితమైన ప్రమాణాల వివరాలను తక్షణమే తమ అధికారిక వెబ్‌సైట్లలో ప్రచురించాలని గుర్తింపు పొందిన అన్ని జాతీయ క్రీడా సమాఖ్యలను కోరిందిఈ సమాచారాన్ని సమర్పించడానికి 2026 జూలై 15 వరకే ఆఖరి గడువుగా విధించింది.

 

ఈ ఎంపిక మార్గదర్శకాలను తమ పరిధిలోని అన్ని అనుబంధ రాష్ట్రకేంద్రపాలిత ప్రాంతాల క్రీడా సంఘాలకు కూడా చేరవేయాలని ఎన్‌ఎస్‌ఎఫ్‌లను ఆదేశించింది.

 

క్రీడాకారుల ఎంపిక ప్రక్రియలో మరింత పారదర్శకతనుజవాబుదారీతనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందిఒలింపిక్ అర్హత ప్రమాణాలుఎంపిక విధానాలు చాలా ముందుగానే ప్రజల ముందుకు రావడం వల్ల క్రీడా రంగానికి చెందిన భాగస్వాములందరికీ ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

***


(रिलीज़ आईडी: 2283183) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Kannada , Malayalam