మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొచ్చిలో నేటి నుంచి బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశం ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 06 JUL 2026 12:17PM by PIB Hyderabad

కొచ్చిజూలై 62026:  భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సదస్సు-2026 ఆధ్వర్యంలో బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ (డబ్ల్యూడబ్ల్యూజీ) సమావేశం కేరళలోని కొచ్చిలో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉన్నత స్థాయి సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొంటున్నారు. మహిళా సాధికారతమహిళల నేతృత్వంలో అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చించడంతోపాటు,  పరస్పర ప్రయోజనాలు కలిగిన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సు సాగుతోంది.

ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతినిధులకు కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్ ఘనంగా స్వాగతం పలికారు. భౌగోళిక సరిహద్దులు మనల్ని భౌతికంగా దూరంగా ఉంచినప్పటికీమహిళా సాధికారతను పెంపొందించాలనే మన ఉమ్మడి సంకల్పమే మనల్ని ఇంత దగ్గరగా చేర్చిందని పేర్కొన్నారు. ఈ రెండు రోజుల సమావేశం అర్థవంతమైన చర్చలకుపరస్పర అభ్యాసానికినిర్మాణాత్మక సహకారానికి వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ సదస్సు మరింత బలోపేతం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత కాలంలో మహిళా సాధికారత విభాగం ప్రధానంగా నాలుగు కీలక ప్రాధాన్యత రంగాల ఆధారంగా ముందుకు సాగుతోందని అనిల్ మాలిక్ వివరించారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి ఆకాంక్షలుప్రస్తుత ప్రపంచ సవాళ్లను ప్రతిబింబించేలా ఈ రంగాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. వాటిలో మొదటిది.. మహిళల పాలననాయకత్వం ద్వారా మరింత పటిష్టమైన బ్రిక్స్ కూటమిని నిర్మించడం,  రెండోది.. మార్పునకు చోదక శక్తులుగా ఆర్థికడిజిటల్ రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడంమూడోది.. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంవారి నైపుణ్యాభివృద్ధికి తోడ్పడటంనాల్గవది.. వాతావరణ మార్పుల నియంత్రణ చర్యలుఆహార భద్రతపోషకాహార లభ్యతలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడం. 

గత కొన్ని నెలలుగా జరిగిన వివిధ కార్యక్రమాలకు ఈ ప్రాధాన్యతా రంగాలు ఒక బలమైన వేదికను అందించాయనికొచ్చి సమావేశంలో జరిగే చర్చలకు కూడా ఇవే దిశానిర్దేశం చేస్తాయని కేంద్ర కార్యదర్శి అనిల్ మాలిక్ పేర్కొన్నారు. ఈ సదస్సు కోసం జరిగిన ముందస్తు సంప్రదింపుల సమయంలో సభ్య దేశాలు ప్రదర్శించిన నిర్మాణాత్మక వైఖరిరాబోయే రెండు రోజుల చర్చల్లోనూ కొనసాగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దీని వల్ల వివిధ దేశాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకోవడానికిఉమ్మడి అవగాహనను పెంపొందించుకోవడానికిఈ సమావేశ నిర్ణయాలపై ఒక సమష్టి ఒప్పందానికి రావడానికి వీలవుతుందని  తెలిపారు.

భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ సదస్సు ఇతివృత్తమైన ‘‘స్థితిస్థాపకతఆవిష్కరణలుసహకారంసుస్థిరత కోసం నిర్మాణం’’ నినాదానికి అనుగుణంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ ఇతివృత్తం ప్రధానంగా ప్రజల సంక్షేమానికి,  మానవత్వమే ప్రథమం అనే విధానానికి పెద్దపీట వేస్తుంది. కొచ్చిలో ప్రస్తుతం జరుగుతున్న ఈ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశం ముగిసిన వెంటనే జూలై 89 తేదీల్లోలో రెండు రోజుల పాటు బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల స్థాయి సదస్సు కూడా ఇక్కడే జరగనుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2281666) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Malayalam