రాష్ట్రపతి సచివాలయం
భారత రాష్ట్రపతికి పరిచయ పత్రాలను సమర్పించిన ఆరు దేశాల దూతలు
प्रविष्टि तिथि:
06 JUL 2026 2:36PM by PIB Hyderabad
ఈ రోజు (2026 జులై 6న) రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆరు దేశాలు.. మొజాంబిక్, నికరాగువా, సూరినామ్, గబొన్ గణతంత్రం, మంగోలియా, బహామాస్‌కు చెందిన దూతల వద్ద నుంచి వారి పరిచయ పత్రాలను స్వీకరించారు.
రాష్ట్రపతికి తమ పరిచయ పత్రాలు సమర్పించిన వారిలో మొజాంబిక్ గణతంత్ర హైకమిషనరు శ్రీ అర్మాండో పెడ్రో ముయువాన్ జూనియర్,నికరాగువా గణతంత్ర రాయబారి నాదెస్కా ఇమారా కుథ్‌బర్ట్ కార్ల్‌సెన్,సూరినామ్ గణతంత్ర రాయబారి శ్రీమతి హనీషా జైరామ్, గబొన్ గణతంత్ర హైకమిషనరు శ్రీ అరెలీన్-మార్సెల్ మింటా ఎన్‌గుయెమా, మంగోలియా రాయబారి డాక్టర్ ఉల్‌జీత్ లువ్‌సంజావ్‌తో పాటు బహామాస్ కామన్వెల్త్ హైకమిషనరు శ్రీ పీటర్ నికొలస్ సిమోనెట్ ఉన్నారు.
(रिलीज़ आईडी: 2281664)
आगंतुक पटल : 13