ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్ర షోలాపూర్ రూరల్ లో దుర్ఘటన ప్రాణనష్టం సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
14 JUN 2026 11:40PM by PIB Hyderabad
మహారాష్ట్ర షోలాపూర్ రూరల్ లో ఓ దుర్ఘటన కారణంగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ విషాద సమయంలో ఆత్మీయులను కోల్పోయిన వారికి శ్రీ మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దుర్ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థించారు.
మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందిస్తారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘మహారాష్ట్ర.. షోలాపూర్ రూరల్ లో ఓ దుర్ఘటన కారణంగా ప్రాణనష్టం జరగడం అత్యంత బాధాకరం. ఈ విషాద సమయంలో ఆత్మీయులను కోల్పోయినవారికి నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను. దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను అందిస్తారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందిస్తారు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’ అని పేర్కొంది.
(रिलीज़ आईडी: 2281559)
आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam