ప్రధాన మంత్రి కార్యాలయం
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కీకో ఫుజిమోరిని అభినందించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
04 JUL 2026 1:54PM by PIB Hyderabad
పెరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీమతి కీకో ఫుజిమోరికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్-పెరూ మధ్య గల దీర్ఘకాలిక, స్నేహపూర్వక సంబంధాలను ప్రస్తావిస్తూ... పలు రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
పెరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కీకో ఫుజిమోరి గారికి హృదయపూర్వక అభినందనలు.
పెరూతో సన్నిహిత స్నేహానికి భారత్ ఎంతో విలువనిస్తుంది. పలు రంగాల్లో మన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంది. మీ పదవీకాలం విజయవంతం కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రజల ప్రయోజనాల కోసం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేయడానికి మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను.
@KeikoFujimori
(रिलीज़ आईडी: 2281249)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam