ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేటి నుంచి అమల్లోకి వచ్చిన భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం


న్యూఢిల్లీలో 2025 సెప్టెంబర్ 8న ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకాలు చేసిన భారత్‌-ఇజ్రాయెల్ ప్రభుత్వాలు

प्रविष्टि तिथि: 04 JUL 2026 9:00AM by PIB Hyderabad

భారత్‌- ఇజ్రాయెల్ దేశ ప్రభుత్వాల మధ్య 2025 సెప్టెంబర్ 8న న్యూ ఢిల్లీలో కుదిరిన  ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (బీఐఏ) నేటి నుంచి (2026 జూలై 04) అధికారికంగా అమల్లోకి వచ్చింది.

 

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, పెట్టుబడులకు సురక్షితమైన, నమ్మకమైన వాతావరణాన్ని కల్పించడానికి ఈ ఒప్పందం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

 

ఈ ఒప్పందం అంతర్జాతీయ పెట్టుబడి చట్టాల ఆధునిక సూత్రాలు, మారుతున్న న్యాయపరమైన అంశాలను ప్రతిబింబించేలా రూపొందించారు. ఇది ఒకవైపు పెట్టుబడిదారులకు, వారి పెట్టుబడులకు అత్యంత పటిష్టమైన రక్షణను కల్పిస్తూనే మరోవైపు దేశ సార్వభౌమత్వ విధానాలకు, చట్టబద్ధమైన ప్రజా విధాన లక్ష్యాలకు తగినంత పారదర్శకతను, స్వేచ్ఛను అందిస్తుంది.

 

ఈ ఒప్పందం వల్ల భారత్-ఇజ్రాయెల్ దేశాల మధ్య పరస్పర పెట్టుబడి కార్యకలాపాలు పెరగడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని భావిస్తున్నారు.

 

భారత్-ఇజ్రాయెల్ బీఐఏ 2026 ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు.

https://dea.gov.in/files/bilateral_investment_treaties_document/India-Israel%20BIA%20English%20Version.pdf

 

***


(रिलीज़ आईडी: 2281246) आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam