రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గత ఏడాది జూన్ తో పోలిస్తే జూన్ 2026లో సరుకు రవాణాలో 4% వృద్ధినీ

ప్రయాణికుల రద్దీలో స్థిరమైన వృద్ధినీ నమోదు చేసిన భారతీయ రైల్వే


దేశ ఆర్థిక వృద్ధి చోదక శక్తిగా తన బాధ్యతను చాటుకుంటూ జూన్ 2026లో 142 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసిన భారతీయ రైల్వే

జూన్ లో ఎరువుల రవాణాలో 19.1 శాతం, ఇతర వివిధ వస్తువుల రవాణాలో 17.3 శాతం, ఇనుప ఖనిజం రవాణాలో 9.4 శాతం, విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణాలో 7 శాతం వృద్ధి

2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం స్థాయిని అధిగమిస్తూ 2026-27 మొదటి త్రైమాసికంలో 419 మిలియన్ టన్నులను దాటిన సరుకు రవాణా

దాదాపు 64 కోట్లకు చేరిన ప్రయాణికుల సంఖ్య

సురక్షితమైన, విశ్వసనీయమైన, అందుబాటు ధరల్లో ప్రయాణ సౌకర్యంతో దేశవ్యాప్తంగా వేసవిలో సేవలు అందించిన 164 వందే భారత్, 72 అమృత్ భారత్ రైళ్లు

प्रविष्टि तिथि: 02 JUL 2026 3:29PM by PIB Hyderabad

భారతీయ రైల్వే తన అద్భుతమైన నిర్వహణ తీరును కొనసాగిస్తూ,  ఈ ఏడాది జూన్ నెలలో సరుకు రవాణా లోనూప్రయాణికుల సేవల్లోనూ స్థిరమైన వృద్ధిని నమోదు చేసిందిఅధిక సరుకు రవాణాపెరిగిన ప్రయాణికుల రాకపోకలు,  ప్రయాణ సేవల నిరంతర విస్తరణ వంటివి దేశ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడంరవాణా వ్యవస్థను బలోపేతం చేయడందేశవ్యాప్తంగా సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాలను కల్పించడంపై భారతీయ రైల్వే నిరంతర కృషిని ప్రతిబింబిస్తున్నాయి.

సరుకు రవాణాలో గణనీయమైన వృద్ధి

భారతీయ రైల్వే జూన్  నెలలో 142.21 మిలియన్ టన్నుల సరుకు రవాణాను సాధించిందిగత ఏడాది ఇదే నెలలో నమోదైన 136.71 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది శాతం వృద్ధిని సూచిస్తోందిసరుకు రవాణా ద్వారా వచ్చిన ఆదాయం కూడా జూన్ 2025తో పోలిస్తే శాతం పెరుగుదలతో దాదాపు రూ. 430 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది.

పలు ప్రధాన వస్తువుల రవాణా కూడా జూన్ నెలలో ఆశాజనకమైన వృద్ధిని నమోదు చేసిందిఎరువుల రవాణా 19.1 శాతంఇతర వస్తువులు  17.3 శాతంఇనుప ఖనిజం 9.4 శాతందేశీయ బొగ్గు 4.9 శాతంమొత్తం బొగ్గు  3.6 శాతంక్లింకర్ 7.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి.ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాల నుంచి  స్థిరంగా ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది.

జూన్ 2026లో సాధించిన ఈ ఘనమైన నిర్వహణ తీరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)  మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్లో నమోదైన నిరంతర వృద్ధిని మరింత బలోపేతం చేసిందిఈ త్రైమాసికంలో భారతీయ రైల్వే 419.08 మిలియన్ టన్నుల సరుకు రవాణాను నిర్వహించిందిగత ఆర్థిక సంవత్సరం (2025-26) ఇదే కాలంలో నమోదైన 413.05 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది మెరుగైన ప్రదర్శనఈ త్రైమాసికంలో పలు కీలకమైన వస్తువుల విభాగాలలో కూడా ఆశాజనకమైన వృద్ధి కనిపించిందిగత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇనుప ఖనిజం లోడింగ్ 7.44 శాతంక్లింకర్ 6.54 శాతం,  ఇతర వస్తువులు 12.16 శాతం వృద్ధిని సాధించాయి.

అధిక వేసవి కారణంగా థర్మల్ పవర్ స్టేషన్ల పెరిగిన అవసరాలను తీర్చడానికి భారతీయ రైల్వే దేశీయ బొగ్గు రవాణాను వేగవంతం చేసిందిగత ఏడాది ఇదే నెలతో పోలిస్తే జూన్ 2026లో విద్యుత్ ప్లాంట్లకు శాతం ఎక్కువ బొగ్గును సరఫరా చేసింది.  తద్వారా దేశవ్యాప్తంగా అంతరాయం లేని విద్యుత్ ఉత్పత్తికి దోహదపడింది

ప్రయాణికుల రాకపోకలలో నిరంతర వృద్ధి

జూన్ 2026 నెలలో ప్రయాణికుల రాకపోకలు కూడా స్థిరమైన వృద్ధిని కనబరిచాయిగత ఏడాది ఇదే నెలలో 62.37 కోట్ల మంది ప్రయాణించగాఈ ఏడాది జూన్ నెలలో భారతీయ రైల్వే 63.81 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చింది.

స్వల్పసుదూర ప్రయాణాలను కలిగివున్న నాన్-సబర్బన్ విభాగం 3.9 శాతం వృద్ధిని నమోదు చేసిందిదీని ద్వారా ప్రయాణికుల సంఖ్య 28.90 కోట్ల నుంచి 30.04 కోట్లకు పెరిగిందిసబర్బన్  విభాగం కూడా 0.9 శాతం సానుకూల వృద్ధిని కనబరిచిందిఇందులో ప్రయాణికుల సంఖ్య 33.46 కోట్ల నుంచి  33.77 కోట్లకు పెరిగింది.

ఆధునిక ప్రయాణ సేవల విస్తరణ

ప్రధాన రైలు సర్వీసుల విస్తరణతో భారతీయ రైల్వే ప్రయాణికుల సేవలను ఆధునీకరించడాన్ని నిరంతరం కొనసాగిస్తోందిఇటీవలే హౌరా -  కామాఖ్య మధ్య ప్రారంభమైన 'వందే భారత్ స్లీపర్సర్వీస్‌తో కలిపి మొత్తం వందే భారత్ సర్వీసుల సంఖ్య 164కి పెరిగిందిజూన్ 2026లో ప్రారంభించిన నాలుగు కొత్త సర్వీసులతో కలిపి అమృత్ భారత్ రైలు సర్వీసుల సంఖ్య 72కి చేరిందిఇది దేశవ్యాప్తంగా అందుబాటు చార్జీల్లో ఆధునిక సుదూర ప్రయాణ అనుసంధానాన్ని  మరింత బలోపేతం చేసింది.

సరుకు రవాణా,  ప్రయాణికుల రాకపోకలలో కనిపిస్తున్న ఈ నిరంతర వృద్ధి  సమర్థవంతమైన రవాణావిశ్వసనీయమైన ప్రయాణికుల సేవలుఆధునిక మౌలిక సదుపాయాలను అందించడంలో భారతీయ రైల్వే నిబద్ధతను ప్రతిబింబిస్తోందినిరంతర సామర్థ్య పెంపుదలమెరుగైన నిర్వహణ సామర్థ్యంప్రయాణికుల ప్రయోజనాలే ప్రాధాన్యతగా తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూదేశవ్యాప్తంగా సురక్షితమైనవిశ్వసనీయమైనప్రయాణికులకు అనుకూలమైన రవాణా సేవలను అందించేందుకు భారతీయ రైల్వే తమ నిబద్ధతను కొనసాగిస్తోంది

 

***


(रिलीज़ आईडी: 2280424) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Odia , Tamil , Kannada