ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నిరంతర ప్రయత్నాలే విజయానికి కీలకం... ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 JUL 2026 4:24PM by PIB Hyderabad

‘‘నానాశ్రాన్తాయ శ్రీరస్తీతి రోహిత శుశ్రుమ, పాపో నృషద్వరో జన ఇంద్ర ఇచ్చరతః సఖా చరైవేతి’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

నిరంతర ప్రయత్నమే విజయానికి కీలకమనీ, జీవితంలో ధైర్యం, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే వ్యక్తే తన లక్ష్యాన్ని సాధించగలుగుతారనీ ఈ సుభాషితం స్పష్టం చేస్తోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

నిరంతర ప్రయత్నాలే విజయానికి తారక మంత్రం. ధైర్యం, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే వ్యక్తులే లక్ష్యాన్ని సాధిస్తారు.

నానాశ్రాన్తాయ శ్రీరస్తీతి రోహిత శుశ్రుమ, పాపో నృషద్వరో జన ఇంద్ర ఇచ్చరతః సఖా చరైవేతి

 

***


(రిలీజ్ ఐడి: 2280422) సందర్శకుల సూచీ సంఖ్య : : 59