ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


ఆపరేషన్ అమిస్తాద్ లో భాగంగా వెనిజువెలాలో అహర్నిశలూ సేవలందిస్తున్న భారత వైద్యులకు పీఎం అభినందనలు

प्रविष्टि तिथि: 01 JUL 2026 12:22PM by PIB Hyderabad

ఇవాళ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారుదేశానికి వారు చేస్తున్న సేవలుచూపుతున్న కరుణనిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు.

వైద్యుల కృషిదయఅంకితభావం.. భారతదేశ ఆరోగ్య రక్షణ వ్యవస్థకు కీలక ఆధారమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారుక్లిష్ట పరిస్థితుల్లోనూ వారు నిరంతరం అందిస్తున్న సేవలు.. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజల విశ్వాసాన్నికృతజ్ఞతను పొందేలా చేశాయని తెలిపారు.

గత దశాబ్ద కాలంలో ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయటంలో భారత్‌ గణనీయమైన పురోగతిని సాధించిందన్నారుదేశంలో వైద్య కళాశాలల సంఖ్య రెట్టింపునకు పైగా పెరిగాయని... అండర్ గ్రాడ్యుయేట్పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు కూడా గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారుఈ అపూర్వమైన వృద్ధి వైద్యరంగంలోకి రావాలనుకునే అభ్యర్థులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని..వైద్య సిబ్బంది వ్యవస్థను బలోపేతం చేస్తుందనిదేశంలోని ప్రతీచోటా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూస్తోందని అన్నారు.

ఆపరేషన్ అమిస్తాద్ లో భాగంగా వెనిజువెలాలో సేవలందిస్తున్న భారత వైద్యులువైద్య నిపుణుల అంకితభావాన్ని శ్రీ నరేంద్ర మోదీ అభినందించారుసమాజం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు బాధ్యతాయుతంగా వైద్యులు ముందుకు వస్తారని.. క్లిష్ట సమయాల్లో వైద్యులు అందిస్తున్న నిస్వార్థ సేవలు నిరూపిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లందరికీ శుభాకాంక్షలువైద్యుల కృషిదయఅంకితభావం.. భారతదేశ ఆరోగ్య రక్షణ వ్యవస్థకు కీలక ఆధారంక్లిష్ట పరిస్థితుల్లో వారు అందిస్తున్న సేవలు దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజల విశ్వాసాన్నీకృతజ్ఞతనీ పొందేలా చేశాయి.

గత దశాబ్ద కాలంలో ఆరోగ్య రంగంలో భారత్ ఎంతో పురోగతిని సాధించిందిదేశంలో వైద్య కళాశాలల సంఖ్య రెట్టింపునకు పైగా పెరిగాయిఅండర్ గ్రాడ్యుయేట్పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగిందిఈ గణనీయమైన వృద్ధివైద్యరంగంలోకి రావాలనుకునే అభ్యర్థులకు మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తుందిఆరోగ్య సంరక్షణ సిబ్బంది వ్యవస్థను బలోపేతం చేస్తుందిదేశంలోని ప్రతీచోటా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూస్తోంది.

మనం వికసిత్ భారత్ దిశగా కృషి చేస్తున్న తరుణంలో.. ఆరోగ్య సంరక్షణను పెంపొందించటంలోవైద్య పరిశోధనలను ముందుకు తీసుకెళ్లటంలోనూతన ఆవిష్కరణలను స్వీకరించటంలోఅందరికీ అందుబాటు ధరలో వైద్య సేవలను అందించటంలో వైద్యులు కీలక పాత్ర పోషిస్తూనే ఉంటారు.

ఈ రోజు జాతీయ వైద్యుల దినోత్సవం... ఆపరేషన్ అమిస్తాద్ లో భాగంగా వెనిజువెలాలో అవిశ్రాంతంగా సేవలందిస్తున్న భారత వైద్యులను ఈ సందర్భంగా అభినందిస్తున్నానుఇలా క్లిష్టపరిస్ధితుల్లోఅవసరంలో ఉన్న వారికి వైద్యులు సేవల్ని అందిస్తారని చెప్పడానికి ఇదే గొప్ప ఉదాహరణ.

 

***


(रिलीज़ आईडी: 2279879) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam