ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

బెంగళూరులో జరిగిన ‘నషా ముక్త్ భారత్ సదస్సు’లో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి

మాదకద్రవ్యాల రహిత భారతావని నిర్మాణానికి సమాజమంతా కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి

‘మాదకద్రవ్యాలు వద్దు’ అనేది దేశవ్యాప్త ఉద్యమంగా మారాలి: ఉపరాష్ట్రపతి

వ్యసన విముక్త ఔషధాలు, మానసిక ఆరోగ్యంపై మరిన్ని పరిశోధనలు జరగాలన్న ఉపరాష్ట్రపతి

प्रविष्टि तिथि: 28 JUN 2026 2:33PM by PIB Hyderabad

భారత్‌ను మాదకద్రవ్య రహిత దేశంగా (నషా ముక్త్ భారత్మార్చేందుకు విద్యాసంస్థలుకుటుంబాలుఆరోగ్య నిపుణులుచట్టాన్ని అమలు చేసే సంస్థలుపౌర సమాజం కలిసికట్టుగా పనిచేయాలని భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారుమత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటం వ్యక్తులతో ప్రారంభమై దేశవ్యాప్త ఉద్యమంగా ఎదగాలని ఆయన పేర్కొన్నారు.

బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఆర్‌జీయూహెచ్ఎస్) 31వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోదిశ బోధ్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన 'నషా ముక్త్ భారత్ సదస్సు'లో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల వ్యసనం కేవలం ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా వారి విద్యాభ్యాసాన్నిఉత్పాదకతనుసామాజిక సమైక్యతనుదేశాభివృద్ధిని సైతం తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్‌జీయూహెచ్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయానికి అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతి.. వైద్య విద్యపరిశోధనలుప్రజారోగ్య రంగాలకు ఆ విశ్వవిద్యాలయం అందించిన విశేష సేవలను కొనియాడారుదేశ సేవకు అంకితమైన ఎన్నో తరాల ఆరోగ్య నిపుణులను ఈ విశ్వవిద్యాలయం తీర్చిదిద్దిందని ఆయన ప్రశంసించారు.

బెంగళూరుకర్ణాటకతో పాటు యావత్ భారతదేశాన్ని మాదకద్రవ్య రహితంగా మారుస్తామని భారీ సంఖ్యలోని విద్యార్థులు ప్రతిజ్ఞ చేయటం పట్ల శ్రీ సీపీ రాధాకృష్ణన్ హర్షం వ్యక్తం చేశారు. ‘నషా ముక్త్ భారత్’ అంటే కేవలం మాదకద్రవ్యాలు అందుబాటులో లేకపోవడం మాత్రమే కాదని.. ఆరోగ్యకరమైన అలవాట్లనుసరైన నిర్ణయాలను ప్రోత్సహించడంఅండగా నిలిచే కుటుంబాలనుదృఢమైన సమాజాలను నిర్మించడం అని పేర్కొన్నారుప్రతి ఒక్కరూ తమ మనస్సుపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని ఆయన సూచించారుఎప్పుడైతే మాదకద్రవ్యాలు మనస్సును నియంత్రిస్తాయో అప్పుడు మనిషి తన జీవితంపై నియంత్రణను కోల్పోతాడని ఆయన వ్యాఖ్యానించారు.

 

వ్యసనాల వల్ల కోల్పోయే ప్రతి యువ జీవితం దేశ సామర్థ్యానికి తీరని లోటని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారుముఖ్యంగా భవిష్యత్తు వైద్యులునర్సులుఫార్మసిస్టులుమనో వైజ్ఞానిక నిపుణులుపరిశోధకులుప్రజారోగ్య నిపుణులుగా మారబోతున్న విద్యార్థులంతా అవగాహన పెంచే ప్రచారకర్తలుగా మారాలని ఆయన పిలుపునిచ్చారుమత్తు పదార్థాల వ్యసన సమస్యను పరిష్కరించడంలో నివారణచికిత్సపరిశోధనసాక్ష్యాధారాలతో కూడిన విధాన రూపకల్పనలో వారు అగ్రభాగాన నిలవాలని కోరారు.

వ్యసన విముక్తి వైద్యంమానసిక ఆరోగ్యంప్రవర్తనకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రాలుసామాజిక జోక్యంపై మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయన సూచించారుమన చర్యలకు పరిశోధనల నుంచి లభించే సాక్ష్యాధారాలే దిక్సూచి కావాలని.. పరిశోధనల ఆధారంగానే ప్రభుత్వ విధానాలు రూపొందాలని ఆయన చెప్పారుమత్తు పదార్థాలను తీసుకోవటం వల్ల వచ్చే రుగ్మతలను అరికట్టడంలో సాంకేతికతకౌన్సెలింగ్ సేవలుతోటివారి మద్దతు నెట్‌వర్క్‌లను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని ఆయన పేర్కొన్నారు.

మాదకద్రవ్యాల రహిత విద్యాసంస్థలపై తనకు ఉన్న నిరంతర నిబద్ధతను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేశారుతాను మూడు కేంద్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఆయా ప్రాంగణాలను మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారుఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రారంభించిన 'మాదకద్రవ్య రహిత క్యాంపస్ కార్యక్రమం', 'డిజిటల్ ప్రతిజ్ఞ వేదిక'ను ప్రస్తావించిన ఆయన.. ఆయా విద్యా సంస్థల్లో మాదక ద్రవ్య రహిత వాతావరణాన్ని సృష్టించడంలో ఇవి విజయం సాధించటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ వేడుకల్లో భాగంగా కర్ణాటకలో జరుగుతున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారురాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఆర్‌జీయూహెచ్ఎస్అభివృద్ధిప్రగతికి ఇన్నేళ్లుగా అమూల్యమైన సేవలు అందించిన ఆ విశ్వవిద్యాలయ మాజీ వైస్-ఛాన్సలర్లను ఆయన ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ డీకే శివకుమార్ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ (విశ్రాంతసయ్యద్ అబ్దుల్ నజీర్కర్ణాటక వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాష్ ఆర్పాటిల్కర్ణాటక ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ యూ.టీ ఖాదర్ ఫరీద్ఆర్‌జీయూహెచ్ఎస్ వైస్-ఛాన్సలర్ డాక్టర్ భగవాన్ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

***


(रिलीज़ आईडी: 2278774) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam