ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో శ్రీ ఆండీ జస్సీ భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
25 JUN 2026 2:30PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అమెజాన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ ఆండీ జస్సీ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు. భారత్‌లో అమెజాన్ అపూర్వ స్థాయిలో 48 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని పెట్టడం, ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తి ని సూచిస్తోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘శ్రీ ఆండీ జస్సీతో చాలా చక్కనైన సమావేశం. భారత్‌లో అమెజాన్ 48 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడం అపూర్వం. ఇది మా యువతకు కొత్త అవకాశాలను అందిస్తుంది. ఇది భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి ప్రపంచ దేశాల్లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోందని కూడా సూచిస్తోంది’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2277777)
సందర్శకుల సూచీ సంఖ్య : : 48
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada