ప్రధాన మంత్రి కార్యాలయం
వెనెజువెలాలో తీవ్ర భూకంపాలు... మృతులకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
25 JUN 2026 11:01AM by PIB Hyderabad
వెనెజువెలాలో తీవ్ర భూకంపాల ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారు. భారత ప్రజల తరఫున శ్రీ మోదీ సంతాపం తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విషాదంలో బాధితుల వెన్నంటి నిలుస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కష్ట కాలంలో చేతనైన అన్ని విధాలుగా సాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘వెనెజువెలాలో తీవ్ర భూకంపాలు సృష్టించిన విధ్వంసం ఎంతో బాధాకరం.
భారతదేశ ప్రజల తరఫున నేను వెనెజువెలా ప్రజలకు, ప్రభుత్వానికి ప్రత్యేకించి ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, ఈ కష్ట కాలంలో బాధితుల వెన్నంటి నిలుస్తున్నాం.
చేతనైన అన్ని రకాలుగా సాయపడటానికి భారత్ సిద్ధంగా ఉంది’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2277663)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam