భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత నౌకా వాణిజ్య రంగాలను పరిరక్షించేందుకు ప్రత్యేక ఎల్ నినో బులెటిన్‌లను ప్రారంభించిన ఇన్‌కాయిస్


పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు, సముద్ర జీవరాశిపై కలిగే ఒత్తిడి గురించి తొలి ఎల్‌ నినో బులెటిన్లో హెచ్చరించిన ఇన్‌కాయిస్

నౌకా రవాణా నిర్వాహకుల కోసం ఎల్ నినో తొలి అడ్వైజరీని ఆవిష్కరించిన ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి

प्रविष्टि तिथि: 23 JUN 2026 5:55PM by PIB Hyderabad

ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్ నినో కారణంగా నౌకా వాణిజ్య రంగాలు ఎదుర్కొనే అవకాశం ఉన్న ప్రభావాల గురించి తెలియజేసేందుకు ఇన్‌కాయిస్ ప్రత్యేక ఎల్ నినో బులెటిన్లను ప్రారంభించింది. 2026 జూన్ 22న ఇన్‌కాయిస్‌లో జరిగిన కార్యక్రమంలో మొదటి బులెటిన్‌ను చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆవిషష్కరించారు.

ఎల్ నినో ప్రభావం మరింత పెరుగుతుందనిశీతాకాల సమయం (2026 నవంబర్ నుంచి 2027 జనవరినాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని ఈ బులెటిన్ ధ్రువీకరించిందిదీని ఫలితంగా 2027 ఏప్రిల్/మే వరకు హిందూ మహా సముద్ర ఉపతరిల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయిరాబోయే నెలల్లో ముఖ్యంగా ఉత్తర హిందూ మహా సముద్రంలోని (అరేబియా సముద్రంబంగాళాఖాతం రెండింటిలోనూసముద్ర జీవావరణ వ్యవస్థ.. ఉష్ణోగత్రల వల్ల ఎదురయ్యే ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందిముఖ్యంగా 2027 మార్చి నుంచి మే మధ్య ఈ ఒత్తిడి అధికంగా ఉండొచ్చుదీనివల్ల పగడపు దీవులు (కోరల్ రీఫ్స్) తెలుపు రంగులోకి మారడంసముద్ర ఉష్ణ తరంగాలు ఎక్కువగా సంభవించడంఅనువైన ఆవాసాలకు చేపలు వలస వెళ్లడం లేదా వాటి సంతానోత్పత్తి తగ్గడం వల్ల చేపల వేట (ముఖ్యంగా సార్డిన్మాకెరెల్ జాతులుతగ్గే అవకాశం ఉందిఅంతేకాకుండాపెరుగుతున్న ఎల్ నినో ప్రభావం వల్ల సముద్ర పర్యావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా చేపలు ఆశించిన పరిమాణానికి పెరగకపోవచ్చు.

రుతుపవన కాలంలో బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంటుందిభారతదేశ తూర్పు తీరంలో కోతవరదలు పెరిగే అవకాశం ఉందిదీనికి భిన్నంగా అరేబియా సముద్రంపశ్చిమ తీర ప్రాంతం సాధారణం కంటే ప్రశాంతంగా ఉండే అవకాశం ఉందిఇది సానుకూలాంశందీని వల్ల వివిధ సముద్ర సంబంధిత రంగాల కార్యకలాపాలు పెరుగుతాయికొనసాగుతున్న రుతుపవన కాలంలో పశ్చిమ తీరంలో కోతముంపు తక్కువగా ఉండొచ్చు.

 

ఎప్పటికప్పుడు జారీ చేసే హెచ్చరికలను, సూచనలనుసలహాలను నౌకా రవాణా నిర్వాహకులందరూ పరిగణనలోకి తీసుకోవాలని ఇన్‌కాయిస్ సూచించిందిప్రత్యేక బులెటిన్ రెండో సంచికను 2026 జులై రెండో వారంలో జారీ చేస్తారు.

image.png

 

ప్రత్యేక ఎల్ నినో బులెటిన్ విడుదల చేస్తున్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
 
image.png

హిందూ మహా సముద్రంలో ఎల్ నినో ప్రభావం కారణంగా నౌకా వాణిజ్య రంగాలు ఎదుర్కొనే అవకాశం ఉన్న ప్రభావాలు 

***


(रिलीज़ आईडी: 2277363) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Bengali , Tamil