ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఫోన్లో మాట్లాడిన ఖతార్ అమీరు
ఖతార్‌లో జరిగిన ప్రమాదంలో భారత జాతీయుల మృతి పట్ల ఖతార్ అమీరు సంతాపం
అమీరుకు ప్రధానమంత్రి ధన్యవాదాలు... గాయపడిన వారికి తక్షణ వైద్య సాయాన్ని అందించినందుకు ప్రశంసలు
తమ పౌరుల శ్రేయస్సు, భద్రత పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించిన ఇద్దరు నేతలు
పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ఖతార్ సానుకూల తోడ్పాటును అందిస్తోందని మెచ్చుకున్న ప్రధానమంత్రి
ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించిన ఉభయ నేతలు
प्रविष्टि तिथि:
23 JUN 2026 10:34PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఖతార్ అమీరు శ్రీ షేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఈ రోజు టెలిఫోన్లో మాట్లాడారు.
ఖతార్ లోని రాస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జూన్ 21న సంభవించిన ఓ ప్రమాదంలో భారత జాతీయులు మరణించినందుకు ఖతార్ అమీర్ సంతాపాన్ని తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేసినందుకు అమీరుకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సాయాన్ని అందించడాన్ని మెచ్చుకున్నారు.
తమ పౌరుల శ్రేయస్సు, భద్రత పట్ల ఇద్దరు నేతలూ నిబద్ధతను పునరుద్ఘాటించారు. పరస్పరం సహాయాన్ని అందజేసుకోవాలని, సంఘీభావంతో నడుచుకోవాలని మరో సారి సంకల్పాన్ని చెప్పుకొన్నారు.
పశ్చిమాసియాలో స్థితిని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, శాంతి యత్నాల్లో ఖతార్ సానుకూల తోడ్పాటును అందిస్తోందని ప్రశంసించారు. ఆ ప్రయత్నాలు పశ్చిమాసియాలో చిర శాంతికి, సుస్థిరతకు దోహదపడతాయన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు.
ద్వైపాక్షిక సహకారాన్ని అన్ని రంగాల్లో విస్తరించుకునే విషయంలో ఇద్దరు నేతలూ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
తరచు సంప్రదింపులు జరుపుకొంటూ ఉండటానికి వారు అంగీకరించారు.
***
(रिलीज़ आईडी: 2277352)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam