ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీమతి భావనాబెన్ పటేల్ మృతి... సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 22 JUN 2026 1:10PM by PIB Hyderabad

కేంద్రపాలిత ప్రాంతం దాద్రా, నగర్ హవేలీ; దమన్, దీవ్ పాలకుడు శ్రీ ప్రభుల్‌భాయి పటేల్ భార్య శ్రీమతి భావనాబెన్ పటేల్ కన్నుమూత పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
ఆ కుటుంబం అనేక సంవత్సరాలుగా తనకు తెలుసునని, ఆ కుటుంబంతో సౌహార్ద పూర్వక సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి అన్నారు.
శోక సంతప్త కుటుంబానికి శ్రీ మోదీ సంతాపాన్ని తెలుపుతూ, దివంగత ఆత్మకు శాంతి లభించాలని ప్రార్థించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరిచారు.


(रिलीज़ आईडी: 2276633) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam