ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, 16 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్‌డీసీల) తయారీ, అమ్మకం, పంపిణీని నిషేధించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ


ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం, శాస్త్రీయ సమర్థన గల ఔషధాల కాంబినేషన్స్ మాత్రమే అందుబాటులో ఉంచడం లక్ష్యంగా నిర్ణయం

प्रविष्टि तिथि: 20 JUN 2026 12:42PM by PIB Hyderabad

ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం, ఔషధాల హేతుబద్ధమైన వినియోగాన్ని ప్రోత్సహించడం దిశగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక చర్యలు తీసుకుంది. ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం-1940లోని సెక్షన్ 26కింద... 16 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్‌డీసీలతయారీఅమ్మకం, మానవ వినియోగం కోసం పంపిణీని నిషేధిస్తూ నోటిఫికేషన్లను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లు తక్షణమే అమల్లోకి వచ్చాయి.

 

దేశంలో అందుబాటులో ఉన్న నిర్ధిష్ట మోతాదు కలయికల (ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్‌ల)పై సమగ్ర సమీక్ష జరపాలని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగాడ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (డీటీఏబీవివిధ ఎఫ్‌డీసీలను పరిశీలించి... వాటిలో సహేతుకమైనవి కానివిచికిత్సాపరమైన సమర్థన లేనివిమానవ ఆరోగ్యానికి ప్రమాదాలు కలిగించే అవకాశం ఉన్నవి ఏవో గుర్తించడానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

 

నిపుణుల కమిటీ శాస్త్రీయ అంచనా, సిఫార్సుల ఆధారంగా... చికిత్సాపరమైన సమర్థన లేనివిగా, వాటి వల్ల కలిగే సంభావ్య ప్రమాదాల దృష్ట్యా వాటి నిరంతర వాడకం ప్రయోజనకరంగా లేదని తేల్చిన 16 ఎఫ్‌డీసీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిషేధించిన ఎఫ్‌డీసీలు కొన్ని చర్మవ్యాధుల సంబంధిత మందులునొప్పి నివారణ, కండరాల నొప్పుల నివారణ మందులుయాంటీబయాటిక్ ఆధారిత ఫార్ములేషన్లు సహా వివిధ చికిత్సా వర్గాలకు చెందినవిగా ఉన్నాయి.

 

ప్రజలకు సురక్షితమైనప్రభావవంతమైన, శాస్త్రీయంగా ధ్రువీకరించిన మందులు మాత్రమే అందుబాటులో ఉండేలా చూసేందుకు ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు అనుగుణంగానే ఈ చర్య ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గతంలోనూవివరణాత్మక శాస్త్రీయ సమీక్ష అనంతరం సహేతుకమైనవి కాని అనేక ఎఫ్‌డీసీలను నిషేధించారు. ఇది రోగి భద్రత, సాక్ష్యాధారిత ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

తదనుగుణంగామానవ వినియోగం కోసం ప్రమాదకరమైనవిగా గుర్తించిన 16 ఎఫ్‌డీసీల తయారీఅమ్మకంపంపిణీ, సరఫరాపై నిషేధం దేశవ్యాప్తంగా తక్షణమే అమలులోకి వచ్చింది.

అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణాధికారులునియంత్రణా సంస్థలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు ఈ నోటిఫికేషన్‌ల కఠినమైన అమలు, సమ్మతిని నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేశారు. తయారీదారులుదిగుమతిదారులుపంపిణీదారులు, ఇతర భాగస్వాములూ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు.

దీనికి సంబంధించిన ఇ-గెజిట్‌ను ఈ లింక్ ద్వారా చూడవచ్చు: https://egazette.gov.in/WriteReadData/2026/273649.pdf

 

నిషేధించిన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్‌డీసీల) వివరణాత్మక జాబితా కింది విధంగా ఉంది: 

S.No.

Composition of the FDC

Recommendations

1

Acetyl Salicylic acid + Ethoheptazine

ఔషధాలుసౌందర్య సాధనాల చట్టం-1940లోని సెక్షన్ 26A కింద నిషేధానికి సిఫార్సు చేశారు

2

Aloe Extract + Allantoin + Alphatocopherol Acetate +D-Penthenol + Vitamin A

3

Aloe Extract +Vitamin E + Dimethicone + Glycerine

4

Aloe Vera +Jojoba Oil +Vitamin E

5

Aloe vera + Orange oil

6

Aloe vera + Jojoba oil + Wheat germ oil + Tea tree oil

7

Aloe vera + Vitamin E + Herbal

8

Dicyclomine + Paracetamol + Clidinium Bromide

9

Dicyclomine +Paracetamol + Clidinium Bromide + Chlordiazepoxide

10

Gliclazide + Chromium Picolinate

11

Paracetamol + Lignocaine

12

Amoxicillin + Serratiopeptidase+ Lactobacillus Sporogenes

13

Amoxicillin + Cloxacillin + Lactic acid bacillus + Serratiopeptidase

14

Amoxicillin + Serratiopeptidase

15

Cefadroxyl + Probenecid

16

Cefuroxime + Serratiopeptidase

 

***


(रिलीज़ आईडी: 2275639) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Malayalam