"ఒకే స్వరంతో కూడిన సహకారాత్మక కళ సినిమా"
ఎమ్ఐఎఫ్ఎఫ్-2026 ఫిల్మ్ ఎడిటింగ్ వర్క్‌షాప్‌లో దీపా భాటియా
ప్రభావవంతమైన మార్పుల ద్వారా సుదీర్ఘ నిడివిని కొద్ది నిమిషాల స్క్రీన్-టైమ్‌కి కుదించి, "కాలం అనే భావనను
మలచడమే" ఎడిటర్ ప్రధాన బాధ్యత: దీపా భాటియా
ముంబైలో జరుగుతున్న 19వ ‘ఎమ్ఐఎఫ్ఎఫ్-2026’ సందర్భంగా ఈ రోజు నిర్వహించిన “సర్వైవింగ్ ది కట్” కార్యశాలలో ప్రముఖ ఫిల్మ్ ఎడిటర్ దీపా భాటియా ఫిల్మ్ ఎడిటింగ్ కళ, నైపుణ్యంపై విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సెషన్‌లో సినీ రంగానికి చెందిన విద్యార్థులు, సినిమా నిర్మాణంలోని వివిధ అంశాలకు సంబంధించిన నిపుణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సినిమా సారాంశం గురించి దర్శకురాలు, నిర్మాత దీపా భాటియా మాట్లాడుతూ... మోషన్ పిక్చర్, మాంటేజ్‌ల కలయికే సినిమా అన్నారు. సినిమా అనుభవానికి కేంద్రంగా ఉండే మానవీయ స్పర్శను ఎడిటింగ్ నైపుణ్యం ప్రతిబింబించాలని సూచించారు.
ఒక ఎడిటర్‌కు అవసరమైన లక్షణాల గురించి వివరిస్తూ... విచక్షణ, పరిశీలనల ప్రాముఖ్యతను ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. "ఎడిటర్లకు షాట్ గురించి విచక్షణ శక్తి ఉండాలి" అని ఆమె వ్యాఖ్యానించారు. విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, ఒక ఎడిటర్ ఎలాంటి పరధ్యానాలకు తావులేకుండా, దాదాపు ధ్యానంలో ఉన్నట్లుగా, మొత్తం ఫుటేజ్‌నూ జాగ్రత్తగా, ప్రశాంతంగా చూడాలని ఆమె అన్నారు. ఫుటేజ్‌ను శ్రద్ధగా చూడటమే ఎడిటింగ్ ప్రక్రియలో కీలకమైన మొదటి అడుగుగా దీపా భాటియా అభివర్ణించారు.
ఎడిటర్లు చిత్ర రూపకర్తల దృక్పథాన్ని, భావోద్వేగ తీవ్రతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని, తద్వారా ఎడిటింగ్ టేబుల్‌పై గల ప్రాజెక్టుతో ఒక విధమైన సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని పెంచుకోవాలని ఈ మాస్టర్ ఎడిటర్ అన్నారు. అటువంటి నిమగ్నతే ఉత్తమ సృజనాత్మక ఫలితాలను సాధించడానికి వీలు కల్పిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఉత్తమమైన టేక్‌లను గుర్తించడం, వాటిని అత్యంత ప్రభావవంతమైన క్రమంలో అమర్చడం, ఇంకా అత్యంత సముచితమైన ఫ్రేమ్‌లు, కట్‌లను ఎంచుకోవడం వంటివి దీనిలో భాగంగా ఉంటాయని తెలిపారు.
లయను అర్థం చేసుకునే ఒక కళగా ఎడిటింగ్‌ను అభివర్ణిస్తూ... ఎడిటింగ్ ప్రక్రియలో సన్నివేశాలను తీర్చిదిద్దడంలో షాట్‌ల అంతర్గత, బాహ్య లయలు రెండూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని దీపా భాటియా వివరించారు.
తన విస్తృత వృత్తిపరమైన అనుభవంతో దీపా భాటియా తాను ప్రశంసలు పొందిన అనేక ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఆమె ఖాతాలో ‘తారే జమీన్ పర్’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’, ‘రాక్ ఆన్!!’, ‘కై పో చే!’, ‘రయీస్’, ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఒక చిత్రంలో సన్నివేశాలు పరిణితి చెందాల్సిన ప్రాముఖ్యతను ఆమె స్పష్టం చేశారు. ప్రభావవంతమైన మార్పుల ద్వారా సుదీర్ఘ సమయం నివిడిని కొద్ది నిమిషాల స్క్రీన్-టైమ్‌లోకి కుదించడం ద్వారా "కాలం అనే భావనను మలచడం" ఎడిటర్ ముఖ్య బాధ్యతల్లో ఒకటి అని ఆమె పేర్కొన్నారు.
***
रिलीज़ आईडी:
2274901
| Visitor Counter:
19