మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్‌ సన్నద్ధతపై కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం


పరీక్షా నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు, పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

కేంద్ర విద్యాశాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌టీఏ, ఉన్నత విద్యా సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు, ప్రతినిధులతో చర్చలు

प्रविष्टि तिथि: 18 JUN 2026 2:00PM by PIB Hyderabad

జూన్ 21, 2026న నిర్వహించనున్న నీట్ యూజీ రీ ఎగ్జామ్‌కు (పునఃపరీక్షసంబంధించిన సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన నేడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారుకేంద్ర విద్యాశాఖవివిధ రాష్ట్ర ప్రభుత్వాలునేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ), ఉన్నత విద్యా సంస్థలకు చెందిన సీనియర్ అధికారులుప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారుపాఠశాల విద్యఅక్షరాస్యత విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ఉన్నత విద్యా విభాగం కార్యదర్శి శ్రీ వినీత్ జోషిఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ శ్రీ అభిషేక్ సింగ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

ఈ సమావేశంలో కేంద్రమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. పరీక్షా నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలుపారదర్శకతజవాబుదారీతనాన్ని పాటించడం ముఖ్యమని స్పష్టం చేశారుఈ విషయంలో సంబంధిత అధికారులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలనిపూర్తి సన్నద్ధతతో పనిచేయాలని ఆదేశించారుఈ పరీక్షలో ఎలాంటి అవకతవకలు లేకుండాస్వేచ్ఛగానిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు ముందస్తుగానే చేపట్టాలని అధికారులను అదేశించారుఅన్ని స్థాయిల్లో సమన్వయం ఉండటం ఎంతో అవసరమని చెప్పారుఈ రీ ఎగ్జామ్ ప్రక్రియను పర్యవేక్షించడానికిసమన్వయం చేయడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా నియమించిన అధికారులు అన్ని రాష్ట్రాలకు చేరుకుంటారని తెలిపారుఈ అధికారులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలోని ప్రధాన కమాండ్ సెంటర్‌కు నేరుగా నివేదిస్తారని మంత్రి చెప్పారువిద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేని వాతావరణంలో పరీక్ష రాసేలా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన నోడల్ అధికారులు అవసరమైన అన్ని వసతులను కల్పించాలని ఆదేశించారు.

కేంద్ర పాఠశాల విద్యఅక్షరాస్యత విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండాపూర్తి ప్రశాంతతతో పరీక్ష రాసేలా చూడాలని కోరారుపరీక్ష ప్రారంభానికి ముందే విద్యార్థులకు కూర్చునేందుకు ఏర్పాట్లు చేయడంతాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలను సిద్ధం చేయాలని సూచించారుఈ విషయంలో తగిన జాగ్రత్తలుతక్షణ చర్యలు తీసుకోవాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నోడల్ అధికారులను కోరారు.

ప్రస్తుత సమయం నుంచి రీ ఎగ్జామ్ జరిగే తేదీ వరకు ఉన్న కాలం అత్యంత కీలకమైనదని కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శ్రీ వినీత్ జోషి పేర్కొన్నారుఈ సమయంలో ముందస్తుగాచురుకైన సమన్వయంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారుపరీక్షకు సంబంధించిన ఆదేశాలనునిబంధనలను ఎప్పటికప్పుడు సకాలంలో అందరికీ చేరవేయాలనినిర్దేశించిన అన్ని నిబంధనలన్నింటినీ కచ్చితంగా పాటించాలని ఆయన తెలిపారు.

 

నీట్ యూజీ రీ ఎగ్జామ్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా, సజావుగా నిర్వహించడానికి ఎన్‌టీఏ అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తోందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ శ్రీ అభిషేక్ సింగ్ తెలిపారుజిల్లాల కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి సమన్వయ కమిటీలురాష్ట్ర పోలీసు విభాగాలునిఘ సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ.. పరీక్షను అత్యంత సురక్షితమైనపారదర్శకమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

 

ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పరీక్షా సన్నద్ధత, వివిధ విభాగాల మధ్య సమన్వయంకట్టుదిట్టమైన భద్రతా నియమాలునిర్వహణ ఏర్పాట్లువిద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార వేదికలుపరీక్షా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారుపరీక్షను సజావుగాపారదర్శకంగాఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడానికి అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు సంబంధిత భాగస్వాములతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు.

 

హైబ్రిడ్ పద్దతిలో జరిగిన ఈ కీలక సమావేశానికి దేశవ్యాప్తంగా మొత్తం 222 మంది ప్రతినిధులు హాజరయ్యారువివిధ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఉన్నతాధికారులుకేంద్ర నిధుల ద్వారా నడిచే విద్యాసంస్థల నోడల్ అధికారులుదేశంలోని ప్రముఖ ఉన్నత విద్యాసంస్థల వైస్ ఛాన్సలర్లుడైరెక్టర్లు ఈ సదస్సులో పాల్గొన్నారుపరీక్షలను సజావుగా నిర్వహించడానికి కేంద్ర విద్యాశాఖకు సంపూర్ణంగా సహకరిస్తామని వారంతా హామీ ఇచ్చారువిద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేనిప్రశాంతమైన వాతావరణంలో పరీక్షా అనుభవాన్ని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

***


(रिलीज़ आईडी: 2274766) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam