రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్లకు చేరిక

प्रविष्टि तिथि: 17 JUN 2026 9:17AM by PIB Hyderabad

భారత్ రక్షణ ఉత్పత్తులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇదివరకు ఎప్పుడూ లేనంతగా వృద్ధి చెందిరూ.1.78 లక్షల కోట్లకు చేరుకుందిఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో  రూ.1.54 లక్షల కోట్ల ఉత్పత్తితో పోలిస్తే, 15.6 శాతం అధిక వృద్ధిని సూచిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరపు రూ.84,643 కోట్ల స్థాయి కన్నా ఇది ఏకంగా 110 శాతం పెరుగుదలదేశీయ రక్షణ ఉత్పత్తులు 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.43,746 కోట్ల స్థాయిలో ఉండగాప్రస్తుతం దాదాపు నాలుగింతలైంది.
మొత్తం ఉత్పత్తిలో సుమారు 76 శాతం ఉత్పత్తిని రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలుఇతర పీఎస్‌యూలే సాధించాయి. 24 శాతం ఉత్పత్తులను ప్రయివేటు రంగం సమకూర్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రయివేటు రంగం 22 శాతం ఉత్పత్తులను అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రయివేటు రంగం సుమారు రూ.42,000 కోట్ల విలువైన ఉత్పత్తిని నమోదు చేసిందిఇంత భారీ స్థాయిలో ఆ రంగం ఉత్పత్తి చేయడం ఇదే మొదటి సారిఇది రక్షణ విస్తారిత అనుబంధ వ్యవస్థలో ప్రయివేటు రంగం పాత్ర అంతకంతకు పెరుగుతుండటాన్ని సూచిస్తోందిగత కొన్ని సంవత్సరాల్లో రక్షణ ఉత్పత్తిలో నమోదైన వృద్ధి ఈ రంగంలో ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుకోవడానికి ఎంతగానో తోడ్పడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.38,424 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేశారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో మొదలుపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా రక్షణ రంగ తయారీలో స్వయంసమృద్ధి సాధన దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు జోరందుకుంటున్నాయని తాజా ఘనత చాటిచెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఒక సందేశాన్ని పొందుపరుస్తూభారత్ రక్షణ ఉత్పత్తులు సరికొత్త శిఖర స్థాయిని అందుకొంటున్న ఖ్యాతి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వానిదేనని తెలిపారురక్షణ ఉత్పత్తి విభాగంప్రభుత్వప్రయివేటు రంగాల ఉమ్మడి కృషితో ఈ ముఖ్య ఘట్టం ఆవిష్కారమైందంటూ మంత్రి అభినందనలు తెలిపారుఈ ప్రగతి దేశ రక్షణ పరిశ్రమల శక్తి సామర్థ్యాలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయని స్పష్టం చేస్తోందని కూడా ఆయన అన్నారువిధాన రూపకల్పన ద్వారా అందిస్తున్న మద్దతుఅనేక కొత్త కార్యక్రమాల అమలుప్రయివేటు రంగం భాగస్వామ్యం పెరగడం, ఎగుమతి సత్తా పుంజుకోవడంతో రాబోయే కాలంలో మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి రక్షణ ఉత్పత్తుల రంగం సన్నద్ధమవుతోందని మంత్రి పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2273892) आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Bengali , Bengali-TR , English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati