యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికసిత్ భారత్ 2047 లక్ష్యాలపై యువత వినూత్న ఆలోచనలు, సరికొత్త దృక్పథాలతో వికసిత్ భారత్ యువ పార్లమెంట్ 2026 జాతీయ స్థాయి సదస్సు ప్రారంభం


వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో దేశ యువతదే కీలక పాత్ర: లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా

జెన్ జీ అంటేనే అమితమైన పట్టుదల, ఉత్సాహానికి నిదర్శనం... వారి ఆలోచనలను, శక్తిని దేశ నిర్మాణానికి ఉపయోగపడే దిశగా నడిపించాలి: కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

प्रविष्टि तिथि: 16 JUN 2026 2:29PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో వికసిత్ భారత్ యువ పార్లమెంట్ 2026 జాతీయ స్థాయి సదస్సును లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్రారంభించారుకేంద్ర యువజన వ్యవహారాలుక్రీడలుకార్మికఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారుఆయతోపాటు యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి పల్లవి జైన్ గోవిల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుఈ సదస్సులో దేశవ్యాప్తంగా 757 విశ్వవిద్యాలయాలువిద్యాసంస్థల నుంచి ఎంపికైన యువ ప్రతినిధులు ఒకే వేదికపై చేరి వికసిత్ భారత్@2047 లక్ష్యాలపై తమ వినూత్న ఆలోచనలనుదృక్పథాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా మాట్లాడుతూ.. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో దేశ యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారుభారతీయ యువత ఉన్నత ఆశయాలుగొప్ప లక్ష్యాలుపెద్ద కలలతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ‘‘అభివృద్ధి చెందిన దేశ భవిష్యత్తుకు యువతే అతిపెద్ద బలం’’గా అభివర్ణించారువారి దృఢ సంకల్పంవినూత్న ఆలోచనలునాయకత్వ సామర్థ్యాలే 2047 నాటి భారత్‌ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ‘‘రాబోయే సంవత్సరాల్లో శాస్త్రసాంకేతికతపరిశోధనఆవిష్కరణల రంగాల్లో భారతీయ యువత ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని.. నేడు ప్రపంచమంతా దేశ యువతను ఆశకుఆత్మవిశ్వాసానికిభవిష్యత్తు అవకాశాలకు ప్రతీకగా చూస్తోంది’’ అని పేర్కొన్నారువికసిత్ భారత్ అనేది సమష్టి లక్ష్యమని చెబుతూ.. అభివృద్ధి చెందిన భారత్ కల ఏ ఒక్క వ్యక్తిదోసంస్థదో లేదా ప్రభుత్వానిదో కాదన్నారు. ‘‘వికసిత్ భారత్ 140 కోట్ల మంది భారతీయుల ఉమ్మడి జాతీయ సంకల్పం’’ అని స్పీకర్ స్పష్టం చేశారుఈ మహత్తరమైన లక్ష్యాన్ని 2047 నాటికి సాధించే బాధ్యత ప్రధానంగా నేటి యువత భుజాలపైనే ఉందన్నారుయువతలోని అపారమైన శక్తిఆవిష్కరణల ఆలోచనధైర్యంపట్టుదలే వికసిత్ భారత్ కలను నిజం చేయడానికి బలమైన శక్తులుగా మారుతాయని శ్రీ ఓం బిర్లా తెలిపారు.

ఈ సదస్సును ఉద్దేశించి కేంద్ర యువజన వ్యవహారాలుక్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రసంగిస్తూ... దేశ నిర్మాణంలో యువత పోషించాల్సిన విప్లవాత్మక పాత్రను వివరించారుసదస్సుకు హాజరైన ప్రతినిధులకు స్వాగతం పలికిన ఆయన.. ఎంతో కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా అర్హతను సాధించి యువత ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు.  లోక్‌సభ స్పీకర్ ముందే తమ అమూల్యమైన అభిప్రాయాలను పంచుకునే అద్భుతమైన అవకాశం వీరికి దక్కడం ఎంతో అదృష్టమని  అన్నారు.

వికసిత్ భారత్ దార్శనికత గురించి డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకునే 2047 నాటికి భారత్‌ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పించారని తెలిపారుఈ జాతీయ లక్ష్యాన్ని సాధించడానికి యువత తమ వంతు సహకారాన్ని అందించాలని  పిలుపునిచ్చారుదేశంలోని యువశక్తి ప్రాధాన్యతను వివరిస్తూ.. ‘‘ఈ యువశక్తే మన బలంమన శక్తియువత కేవలం మన భవిష్యత్తు మాత్రమే కాదుదేశ సమస్యలన్నింటికీ వారే పరిష్కారం కూడా’’ అని వ్యాఖ్యానించారు.

దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారేనని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారుఇంతటి అపారమైన యువశక్తి గల మన దేశంలో యువత కలిసికట్టుగా సమష్టి సంకల్పాన్ని తీసుకుంటేదేశం ఎదుర్కొంటున్న ఎలాంటి సవాలుకైనా సులభంగా పరిష్కారాలను కనుగొనవచ్చని తెలిపారు.

దేశంలోని యువత సామర్థ్యాలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఎల్లప్పుడూ అపారమైన నమ్మకం ఉందని కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారుగిరిజన ప్రాంతాలుతీర ప్రాంతాలుఈశాన్య రాష్ట్రాలతో సహా విభిన్న నేపథ్యాల నుంచి లక్ష మంది యువ నాయకులను తయారు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారని తెలిపారు. ‘‘దేశ నిర్మాణంలో చురుగ్గా పాలుపంచుకునేలా ఇలాంటి లక్ష మంది యువ నాయకులను సిద్ధం చేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారుశ్రీ మోదీ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ బాధ్యతను తీసుకుంది’’ అని  తెలిపారు.

మై భారత్ వేదిక ఆధ్వర్యంలో యువత నేతృత్వంలో సాగుతున్న వినూత్న కార్యక్రమాలపై పెరుగుతున్న ప్రభావాన్ని కూడా మంత్రి మాండవీయ ఈ సందర్భంగా ప్రస్తావించారుఇందులో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమంవికసిత్ భారత్ బడ్జెట్ క్విజ్యువ కనెక్ట్అనుభవపూర్వ అభ్యాస కార్యక్రమాలు వంటివి యువతను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయని చెప్పారుఈ కార్యక్రమాల ద్వారా యువతీ యువకులు ప్రభుత్వ పాలనసామాజిక సేవదేశ నిర్మాణ ప్రక్రియలలో నేరుగా భాగస్వాములు అవుతున్నారని కేంద్ర మంత్రి వెల్లడించారు.

నేటి తరం యువత ఆలోచనా విధానాన్నివారిలోని ఉత్సాహాన్ని మంత్రి ప్రస్తావిస్తూ.. ‘‘యువతలో ఉన్న అపారమైన శక్తిపట్టుదలవినూత్న ఆలోచనలను వికసిత్ భారత్ నిర్మాణానికి ఉపయోగపడేలా సరైన దిశలో మళ్లించాలి’’ అని పేర్కొన్నారుయువ పార్లమెంట్ వంటి వేదికలు భవిష్యత్తు నాయకులకు ఎంతో మేలు చేస్తాయనిఎన్నో విషయాలను నేర్చుకోవడానికిచర్చించడానికిప్రజాస్వామ్య ప్రక్రియల్లో భాగస్వాములు కావడానికిదేశ ప్రగతికి అర్థవంతమైన సహకారాన్ని అందించడానికి  అద్భుతమైన అవకాశాలను కల్పిస్తాయని చెప్పారు.

ఈ  కార్యక్రమంలో లోక్‌సభ సెక్రటరీ జనరల్ శ్రీ ఉత్పల్ కుమార్ సింగ్కేంద్ర యువజన వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ నితేష్ మిశ్రాతో పాటు మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

కేంద్ర యువజన వ్యవహారాలుక్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ వికసిత్ భారత్ యువ పార్లమెంట్ 2026 సదస్సు న్యూఢిల్లీలో 2026 జూన్ 15 నుంచి జూన్ 17 వరకు జరగనుందిప్రజాస్వామ్య ప్రక్రియలపై యువతకు అవగాహనను మరింత పెంపొందించడానికి,  ప్రభుత్వ పాలనవిధానపరమైన చర్చలుపార్లమెంటు పనితీరుపై వారికి ప్రత్యక్ష అనుభవాన్ని  కల్పించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

ఈ జాతీయ స్థాయి సదస్సులో దేశంలోని అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువ ప్రతినిధులు ఒకే చోటికి చేరి.. జాతీయ ప్రాధాన్యత కలిగిన కీలకమైన అంశాలపై చర్చిస్తూవికసిత్ భారత్@2047 దార్శనికతకు తమ వంతు మేధోపరమైన సహకారాన్ని అందిస్తున్నారు.

***


(रिलीज़ आईडी: 2273605) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada