ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్యతరగతి జీవన సౌలభ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 15 JUN 2026 1:16PM by PIB Hyderabad

మధ్యతరగతి జీవన సౌలభ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ముఖ్యంగా ప్రస్తావించారుమధ్యతరగతి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కృషి చేయడం ప్రభుత్వానికి దక్కిన సౌభాగ్యమని ఆయన అన్నారుదేశ నిర్మాణంలో మధ్యతరగతి లెక్కలేనన్ని మార్గాల్లో తోడ్పాటును అందించిందని ఆయన తెలిపారు.
గత పది సంవత్సరాల్లోసామాన్య ప్రజానీకం జీవన నాణ్యతను మెరుగుపరచడంపై పరిపాలన మరింత ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించిందని కూడా శ్రీ మోదీ అన్నారుఅవకాశాలను సులభంగా చెంతకు చేర్చడంమెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడంప్రజా సేవలను పెంపొందింపచేయడంతక్కువ ఖర్చులో ఆరోగ్యసంరక్షణనాణ్యత కలిగిన విద్యను అందించడంనగరాల్లో స్వచ్ఛతకు ప్రాధాన్యాన్ని ఇవ్వడంరోజువారీ జీవన భారాలను తగ్గించడం ధ్యేయంగా ప్రభుత్వ ప్రయత్నాలు సాగాయని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి వరుసగా కొన్ని సందేశాలను పొందుపరుస్తూ:
‘‘
మధ్యతరగతి కోసం పాటుపడే ప్రభుత్వం...
మన మధ్యతరగతి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పనిచేస్తుండడం ఎన్‌డీఏ ప్రభుత్వానికి దక్కిన సౌభాగ్యంవారు దేశ నిర్మాణానికి ఎనలేని కృషి చేశారు.

సాధారణ పౌరుల జీవ ప్రమాణాలను మెరుగుపరచడానికి పాలన వ్యవస్థ గత దశాబ్ద కాలానికి పైగా దృష్టిని కేంద్రీకరించిందిఅవకాశాల చెంతకు సులభంగా చేర్చడంమెరుగైన మౌలిక సదుపాయాల కల్పనప్రజా సేవలను పెంపొందించడంతక్కువ ఖర్చులో ఆరోగ్యసంరక్షణనాణ్యత కలిగిన విద్యస్వచ్ఛ నగరాలతో పాటు నిత్య జీవన భారాలను తగ్గించే దిశగా మా ప్రయత్నాలు సాగుతున్నాయి’’.
‘‘
మధ్యతరగతి కోసం జీవన సౌలభ్యం ఏ విధంగా మెరుగయ్యిందన్నది ఇక్కడ చూడొచ్చు...’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2272962) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam