ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫ్రాన్స్‌లో జరుగుతున్న భారత్ ఇన్నోవేట్స్-2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

प्रविष्टि तिथि: 14 JUN 2026 4:36PM by PIB Hyderabad

గౌరవనీయులునా ప్రియ మిత్రులుఅధ్యక్షుడు మాక్రోన్వీసీలుపరిశ్రమ నాయకులుఆవిష్కర్తలు,
బోంజోర్!

నమస్తే!
భారత్ ఇన్నోవేట్స్‌ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం మరో దేశంతో వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తుందిదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలు కూడా ఉన్నాయిఅయితే కొన్ని సంబంధాలు కేవలం ఉమ్మడి ప్రయోజనాలతో మాత్రమే కాకుండా ఉమ్మడి లక్ష్యంతో కూడా ముందుకు సాగుతాయిభారత్ఫ్రాన్స్ మధ్య ఉన్న సంబంధం కూడా అలాంటిదే.

అనుబంధందృఢవిశ్వాసం అనే రెండింటితో ఈ సంబంధం కూడుకొని ఉందిఇది ఆవిష్కరణనూస్ఫూర్తినీ తనలో ఇముడ్చుకుందిఉమ్మడి విలువలుఉమ్మడి దార్శనికతే పునాదిగా ఈ బంధం ఏర్పడింది.

ఈ బంధం ఆధారంగానే గడచిన కొన్నేళ్లుగా మేం సంయుక్తంగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించాంకొత్త ఆలోచనలకు మార్గనిర్దేశం చేశాంఅలాగే ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు సాధ్యమైనంత మేర కృషి చేస్తున్నాం.

అంతర్జాతీయ సౌర ఒప్పందమైనాఏఐ సంబంధిత చర్చలైనా లేదా భద్రత నుంచి సుస్థిరత వరకు విస్తరించిన మన సహకారమైనా.. మానవాళికి సంబంధించిన ఏ సమస్యకైనా పరిష్కారాన్ని అందించేందుకు మా రెండు దేశాలు ఎల్లప్పుడూ కలిసే పనిచేశాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలోభారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం ప్రారంభమైందిఈ రోజు ఫ్రాన్స్ భాగస్వామ్యంతో భారత్ ఇన్నోవేట్స్ ప్రారంభం కావడం కూడా మాకు అంతే సంతోషాన్నిస్తోంది.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా మిత్రుడుఅధ్యక్షుడు మాక్రోన్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుప్రెసిడెంట్ మాక్రోన్..! ఇటీవల భారత్‌లో మీరు చేసిన పర్యటనలో.. ఈ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ఫ్రాన్స్ సంయుక్తంగా కృషి చేయాలని మీరు అన్నారుఈ రోజు చేపడుతున్న ఈ కార్యక్రమం.. ఆ దిశగా వేసిన ముఖ్యమైన ముందడుగు అని నేను గర్వంగా చెప్పగలను.
భారత్‌లో ఉన్న ప్రతిభకుయూరోపియన్ పెట్టుబడులకూ మధ్య వారధిగా భారత్ ఇన్నోవేట్స్ వేదిక ఆవిర్భవించిందిఐరోపా నైపుణ్యంతో భారతీయ యువ ప్రతిభ అనుసంధానమయ్యే అవకాశాన్నిచ్చే వేదిక ఇది.
మిత్రులారా,
ప్రస్తుతం, 21వ శతాబ్దపు భారతదేశం ఒక గొప్ప పరివర్తన దశలో ఉందిఅంకుర సంస్థల విప్లవానికి భారత దేశం సాక్ష్యంగా నిలుస్తోందిఈ విప్లవంలోభారతదేశ యువత ఒక నూతన దృక్పథంతోమానవాళికి ప్రయోజనాన్ని అందించేలా సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తున్నారుమా యువ ఆవిష్కర్తలు అభివృద్ధి చేసిన అంతర్జాతీయ స్థాయి పరిష్కారాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి 'భారత్ ఇన్నోవేట్స్ఒక వేదికగా పనిచేస్తుందిఈ కార్యక్రమ నిర్వహణకు నా స్నేహితుడుఐఐటీ ఢిల్లీ బోర్డు ఛైర్‌పర్సన్ శ్రీ హరీశ్ సాల్వే విశేష కృషి చేశారుఆయననూమొత్తం బృందాన్నీ అభినందిస్తున్నాను.
మిత్రులారా,

ఈ రోజుఇక్కడ యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారువారిలో ఒకరు భారత్ భవిష్యత్తుని చూడొచ్చుఇంకొకరు భారత యువత విశ్వాసాన్ని చూస్తూ ఉండొచ్చుఇంకొకరు నవ భారత శక్తిని వీక్షించవచ్చు.
కేవలం పరిష్కారాలను వినియోగించుకునే దేశంగానే మిగిలిపోకుండా.. పరిష్కారాలను అందించే దేశంగా భారత్ ఎదుగుతోందిఇక్కడకొందరు ఏఐ ద్వారా గ్రామీణ జీవితాన్ని మార్చేందుకు కృషి చేస్తుండగామరికొందరు రైతులకు తోడ్పడేలా ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారుస్మార్ట్ సిటీలుఅధునాతన తయారీనూతన పదార్థాల ద్వారా స్మార్ట్ సిటీల భవిష్యత్తును మరికొందరు తీర్చిదిద్దుతున్నారుఇంకొందరు గ్రీన్ హైడ్రోజన్విద్యుత్ వాహనాలుబ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా సుస్థిర భవిష్యత్తును అందిస్తున్నారుఅదే సమయంలో రక్షణభద్రతా రంగాలలో కొత్త టెక్నాలజీలను అనేక అంకుర సంస్థలు అభివృద్ధి చేస్తున్నాయి.

విస్తృత స్థాయిలోవేగంగా భారత్ ఆవిష్కరణలు చేస్తోందని మీ సామర్థ్యాలను చూసి నేను చెప్పగలనుసుస్థిరమైన భవిష్యత్తు కోసంయావత్ ప్రపంచం కోసం భారత్ ఆవిష్కరణలు చేస్తోంది.
మిత్రులారా,
ఈ కార్యక్రమంలో అనేక మంది వెంచర్ క్యాపిటలిస్టులుపరిశ్రమ దిగ్గజాలు ఉన్నారువారి సమక్షంలో.. భారత్ నుంచి వచ్చిన ఈ యువ ప్రతిభావంతులను నేను అభినందించాలనుకుంటున్నాను.

ఇక్కడికి వచ్చిన వారంతా సంప్రదాయ మార్గాన్ని కాకుండా.. కొత్త మార్గాన్ని ఎంచుకున్నారుతమకంటూ ఒక కొత్త దిశను ఏర్పాటు చేసుకున్నారుఇక్కడ మీరు సుమారు 100 నుంచి 125 అంకుర సంస్థలను చూస్తూ ఉండవచ్చుకానీ ప్రస్తుతం భారత దేశంలో 2,00,000కు పైగా ఇలాంటి అంకుర సంస్థలు ఉన్నాయిఈ అంకురసంస్థలే పునరుత్తేజిత శక్తితో భారతీయఅంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల వృద్ధికి దోహదపడుతున్నాయి.
మిత్రులారా,

ఈ ప్రపంచానికి.. అంతరాయమూఅభివృద్ధితో కూడిన దశాబ్దమిదికొనసాగుతున్న సంఘర్షణలుపెరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావం మధ్య మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందిప్రస్తుతం మానవాళి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ.. మన ముందున్న అవకాశాలు కూడా అంతే ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి.
కృత్రిమ మేధక్వాంటమ్ కంప్యూటింగ్బయోటెక్నాలజీఅంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంఅధునాతన మెటీరియళ్లు.. ఇవన్నీ మానవాళి భవిష్యత్తును తీర్చిదిద్దే సాంకేతిక పరిజ్ఞానాలుఅవి మానవ నాగరికతకు సంబంధించిన తదుపరి అధ్యాయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

ప్రతి సాంకేతిక విప్లవం మానవాళికి నూతన అవకాశాన్ని అందిస్తోందిప్రతి అవకాశమూ కొత్త బాధ్యతను తీసుకొస్తోందివిశ్వసనీయమైనసమ్మిళితమైనమానవ కేంద్రకమైనప్రపంచ క్షేమాన్ని లక్ష్యంగా చేసుకున్న సాంకేతిక పరిజ్ఞానాల వైపు ఈ ప్రపంచం చూస్తోందిఈ తరుణంలో మానవాళి కోసం సాంకేతిక పరిజ్ఞానాలకుమానవ కేంద్రక ఆవిష్కరణలకు భారతదేశం ప్రాధాన్యమిస్తోంది.

మిత్రులారా,
మా డిజిటల్ విప్లవానికి ఈ మంత్రమే ప్రధానాధారంగా ఉందిఇది భారతదేశ డిజిటల్ మౌలిక వసతుల సారాంశాన్ని కూడా ప్రతిబింబిస్తుందిమా ఏఐ దార్శనికత ప్రాథమిక సూత్రం కూడా ఇదేఅందరి కోసం ఏఐ – అందరి సంక్షేమంశ్రేయస్సు కోసంఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రధాన ఇతివృత్తం కూడా ఇదే.
మిత్రులారా,
ఆవిష్కరణలుసమ్మిళితం ఒకదానికొకటి విరుద్ధమైనవి కావనిపరస్పరం సహకరించుకొనేవని భారత్ నిరూపించిందిఏ ఆవిష్కరణ గొప్పదనమైనా అది దాని విలువలో ఉండదనీమానవులపై అది చూపే ప్రభావంలోనే ఉంటుందని దీని అర్థం.

ఇదే భారత్ ఇన్నోవేట్స్ స్ఫూర్తిఇదే భారతదేశ దార్శనికతఇక్కడ ఉన్న అంకుర సంస్థలతో పాటుమీ అందరికీ కూడా ఇది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
మిత్రులారా,
భారత్ డీఎన్ఏ‌లోనే ఆవిష్కరణ ఉందితన విజ్ఞానంఆవిష్కరణలతో ఈ ప్రపంచానికి కొన్ని వేల ఏళ్లు భారత్ నూతన దిశను అందించిందిగణిత శాస్త్రం నుంచి ఖగోళ శాస్త్రం వరకూవైద్యశాస్త్రం నుంచి యోగా వరకూ భారత్ చేసిన కృషి మానవాళి ప్రగతికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేశాయిఈ వారసత్వానికి కొత్త వేగాన్నికొత్త దిశనూ ప్రస్తుతం మేం అందిస్తున్నాం.

మిత్రులారా,
గడచిన 11-12 ఏళ్లలో ఆవిష్కరణలకు అవసరమైన బలమైన వ్యవస్థను భారత్ నిర్మించిందిమేధోహక్కులు పొందడం నుంచి ఇంక్యుబేషన్ వ్యవస్థల వరకూస్టార్టప్ ఇండియా నుంచి విధాన సహకారం వరకూ ఈ మొత్తం ప్రయాణం యుద్ధ ప్రాతిపదికన ముందుకు సాగింది.

ప్రస్తుతంప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్ ఉందిఅయితేమా దృష్టి కేవలం ప్రధాన నగరాలకే పరిమితం కాలేదుఆవిష్కరణలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేలా మేం కృషి చేశాం.
పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబులు ఏర్పాటయ్యాయిహ్యాకథాన్లుఆవిష్కరణ సవాళ్లతో యువత అనుసంధానమైందిదేశవ్యాప్తంగా ఇంక్యుబేటర్లుపరిశోధనా సంస్థలు విస్తరిస్తున్నాయిముఖ్యంగా మహిళా ఆవిష్కర్తలు నూతన టెక్నాలజీలతో అనుసంధానమయ్యారు.

ఈ ప్రయత్నాలన్నింటి ఫలితంగా విస్తృత స్థాయిలో పరివర్తనను భారత్ సాధించిందిప్రస్తుతం డ్రోన్ దీదీల నుంచి అంకుర సంస్థల వ్యవస్థాపకుల వరకూ.. నూతన విజయ గాథలను మా మహిళా శక్తి లిఖిస్తోంది.
మిత్రులారా,
మా యువత శక్తిని మరింత ఉపయోగించుకొనేలా భారత డిఫెన్స్ రంగం ఆవిష్కరణలకు స్వాగతిస్తోందిభారత్‌లో రక్షణఅంతరిక్ష రంగాలతో ముడిపడిన వందలాది అంకురంస్థలు ప్రస్తుతం అద్భుతమైన రీతిలో పనిచేస్తున్నాయి.

ఇటీవలే అణువిద్యుత్ రంగంలో కూడా భారత్ గణనీయమైన సంస్కరణలు చేపట్టిందిశుద్ధ ఇంధనంఅధునాతన రియాక్టర్లుఅత్యాధునిక పరిశోధనల్లో నూతన అవకాశాలను ఈ సంస్కరణలు అందించాయి.
ఈ సంస్కరణ ఎక్స్‌ప్రెస్ ఆగదుఅది నిర్విరామంగా ముందుకు సాగుతూనే ఉంటుందిభారత్‌లో ఏర్పాటయ్యే అంకుర సంస్థలు అనేక రెట్లు పెరుగుతాయి.

మిత్రులారా,
దశాబ్దం కిందటి వరకు.. భారతదేశాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించేదిగా ఈ ప్రపంచం చూసేదిఇప్పుడు.. టెక్నాలజీని అందించేదిగా భారతదేశం మారుతోందిభారత్ ఏది ఆవిష్కరించినాఏ పరిష్కారం అందించినా అది మానవాళిలో అధిక భాగానికి ప్రయోజనం చేకూరుస్తుందిభారత్ ఇన్నోవేట్స్ లక్ష్యం కూడా ఇదే.

భారతదేశంతో కలిసి అంతర్జాతీయ ఆవిష్కరణల తదుపరి అధ్యాయాన్ని రూపొందించడానికి ప్రపంచానికి అందిస్తున్న ఆహ్వానమే భారత్ ఇన్నోవేట్స్.
వచ్చే మూడు రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలుచర్చలకు గాను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుమేం భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాంమేం సహ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాంఉమ్మడి పరిశోధనాఉమ్మడి తయారీనీ చేపట్టాలనుకుంటున్నాంమేం దీర్ఘకాలిక సహకారాన్ని ఆశిస్తున్నాం.

ఇక్కడ ఉన్న ప్రతి పెట్టుబడిదారుడినీప్రతి విశ్వవిద్యాలయాన్నీప్రతి పరిశోధనా సంస్థనూప్రతి ఔత్సాహిక పారిశ్రామికవేత్తనూ భారత దేశానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానుమాతో కలసి పనిచేయండిభారత్‌లో రూపొందించండిభారత్‌లో అభివృద్ధి చేయండిప్రపంచం కోసం పరిష్కారాలను రూపొందించండి.

ధన్యవాదాలు.

సూచనప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***


(रिलीज़ आईडी: 2272957) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam