సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రజాభిప్రాయ సేకరణ కోసం టెలివిజన్, రేడియో, అనుబంధ సేవలకు సంబంధించిన టెలికమ్యూనికేషన్ నియమాల ముసాయిదా ప్రచురణ

प्रविष्टि तिथि: 12 JUN 2026 11:17AM by PIB Hyderabad

టెలికమ్యూనికేషన్స్ చట్టాన్ని 2023లో పార్లమెంటు ఆమోదించిందిఇది కాలం చెల్లిన టెలిగ్రాఫ్ చట్టం-1885 స్థానంలో వచ్చిన విప్లవాత్మక చట్టం.

విస్తృత శ్రేణి సేవలతో ఉన్న సమగ్రమైన చట్టమే ఈ టెలికమ్యూనికేషన్స్ చట్టంఈ చట్టం పరిధిలోకి వచ్చే సేవలను బట్టి వివిధ ప్రభుత్వ విభాగాలు అమలును చేపడతాయిటెలివిజన్రేడియోఅనుబంధ సేవలకు సంబంధించిన నిబంధనలను సమాచారప్రసార మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది.

టెలిగ్రాఫ్ చట్టం-1885 ప్రకారం టెలివిజన్రేడియో సేవల కోసం జారీ చేసిన వివిధ మార్గదర్శకాలను నూతనంగా రూపొందించిన టెలికమ్యూనికేషన్స్ చట్టం-2023 పరిధిలోకి తీసుకువచ్చి క్రమబద్ధీకరించేందుకు టెలికమ్యూనికేషన్స్ (టెలివిజన్రేడియోఅనుబంధ సేవలునిబంధనలు-2026ను రూపొందించారు.

ఈ నియమావళిలో పొందుపరిచిన మార్గదర్శకాలు:

  1. భారతదేశంలో శాటిలైట్ టెలివిజన్ ఛానెళ్ల అప్‌లింకింగ్డౌన్‌లింకింగ్ కోసం నవంబర్ 9, 2022 నాటి విధాన మార్గదర్శకాలు.

  2. భారతదేశంలో డైరెక్ట్-టు-హోం (డీటీహెచ్ప్రసార సేవలను అందించటానికి లైసెన్స్ పొందేందుకు మార్చి 15, 2001 నాటి మార్గదర్శకాలువాటిని ఎప్పటికప్పుడు సవరించారు.

  3. భారతదేశంలో హెడ్ఎండ్-ఇన్-ది-స్కై (హిట్స్ప్రసార సేవలను అందించేందుకు నవంబర్ 26, 2009 నాటి మార్గదర్శకాలు.

  4. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఎఫ్ఎం రేడియో ప్రసార సేవల విస్తరణకు సంబంధించి జూలై 25, 2011 నాటి విధాన మార్గదర్శకాలు (ఫేజ్-III), సెప్టెంబర్ 10, 2024 వరకు సవరించిన సంస్కరణలు.

  5. భారతదేశంలో కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ఏర్పాటు కోసం సవరించిన ఫిబ్రవరి 13, 2024 నాటి విధాన మార్గదర్శకాలు.

  6. ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీసేవల నిర్వహణకు సెప్టెంబర్ 8, 2008 నాటి మార్గదర్శకాలు.

ఈ నిబంధనలతో పరిశ్రమకు ఒకే విధమైనసరళమైన నియమావళి అందుబాటులోకి వస్తుందిటెలివిజన్రేడియో ప్రసార రంగంలో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూప్రస్తుత నిబంధనలను క్రమబద్దీకరించిసులభతరం చేస్తూ ఈ నూతన నియమాలను రూపొందించారు.

ఈ నిబంధనలను నోటిఫై చేసిన తర్వాతప్రసార సేవలను నియంత్రించే ప్రస్తుతమున్న వివిధ మార్గదర్శకాల స్థానంలో ఇవి అమల్లోకి వస్తాయిఈ ముసాయిదా నియమాల్లోని ముఖ్యాంశాలు:

  1. నిరంతరాయంగా సాగే మార్పు: సంస్కరణలను అమలు చేస్తూనే కార్యకలాపాల కొనసాగింపునకు వీలుగా ప్రస్తుతమున్న అనుమతి నిబంధనలుషరతులను సమన్వయం చేశారు.

  2. సులభతర వాణిజ్యం

  1. బహుళ మార్గదర్శకాలకు బదులుగా ఒకే నియంత్రణ వ్యవస్థ

  2. డిజిటల్ పద్ధతిలో అనుమతుల ప్రక్రియ అమలు

  3. సులభతర అనుమతి విధానాలు

  4. అనుమతి మంజూరు ఒప్పందం (జీవోపీఏ)పై సంతకం చేయాల్సిన అవసరం తొలగింపు

  5. పారదర్శకమైన వివాద పరిష్కార వ్యవస్థ ఏర్పాటు

ప్రజలువివిధ మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులకు సమాచారప్రసార మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ (www.mib.gov.in)లో ఈ ముసాయిదా నిబంధనలను ప్రచురించారు.

దీనిపై సలహాలుసూచనలుఅభిప్రాయాలను భారత ప్రభుత్వ సమాచారప్రసార మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ (బీపీఎల్)కి జూలై 27, 2026లోపు పంపించాల్సి ఉంటుందికర్తవ్య భవన్-II, 3వ అంతస్తున్యూఢిల్లీ-110001కి పంపవచ్చు. usbpl-moib[at]gov[dot]in ఈమెయిల్ ద్వారా పంపటం ఉత్తమం.

 

***


(रिलीज़ आईडी: 2272158) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam