@Ukhurelsukh"
"ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ ప్రేమతో చెప్పిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు.
గతేడాది ఇథియోపియాలో జరిగిన సమావేశాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఇరుదేశాల ప్రజల, గ్లోబల్ సౌత్ దేశాల పరస్పర ప్రయోజనాల కోసం మన సహకారాన్ని కొనసాగించాలని కాంక్షిస్తున్నా
@AbiyAhmedAli"
"అధ్యక్షుడు వాన్ డెర్ లేయన్ అభినందనలకు ధన్యవాదాలు. వాణిజ్యం, సాంకేతికత, మొబిలిటీ, భద్రతతో సహా పలు రంగాల్లో భారత్-ఈయూ భాగస్వామ్యం నిరంతరం బలపడుతోంది.
రెండు దేశాల ప్రజలు, ప్రపంచ సంక్షేమం కోసం ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మనం కలిసికట్టుగా కృషి చేయాలి.
@vonderleyen"
"శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి మిత్సోటాకిస్‌కు ధన్యవాదాలు.
గ్రీస్‌తో ఉన్న మా విలువైన వ్యూహాత్మక, బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉంది.
@PrimeministerGR"
"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్‌కు ధన్యవాదాలు.
ఇటీవల భారత్‌లో మీరు చేసిన పర్యటనను గుర్తు చేసుకుంటున్నాను. ఎన్నో సవాళ్ల మధ్య నిలిచిన భారత్-సైప్రస్ స్నేహాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే మీ నిబద్ధతకు నేను మద్దతిస్తున్నా.
@Christodulides"
"ఆత్మీయ అభినందనలు తెలిపిన ఛాన్సలర్ మెర్జ్‌కి ధన్యవాదాలు.
భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు, రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం.
@bundeskanzler"
"ప్రధానమంత్రి కార్నీకి ధన్యవాదాలు.
ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం భారత్-కెనడా భాగస్వామ్యం నూతన శిఖరాలను చేరుకుంటుందని విశ్వసిస్తున్నా.
@MarkJCarney"
"ప్రధానమంత్రి ఫెడరిక్సన్ ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలు.
మూడో భారత్-నార్డిక్ సదస్సులో ఇటీవల జరిగిన ఇరుదేశాల సమావేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ గ్రీన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉంది"
"గౌరవ అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ శుభాకాంక్షలకు ధన్యవాదాలు.
దక్షిణ కొరియాతో ఉన్న ప్రత్యేక భాగస్వామ్యానికి భారత్ ఎంతో విలువనిస్తుంది. ఇరుదేశాల మధ్య సహకారాన్ని కలిసికట్టుగా నూతన శిఖరాలకు తీసుకువెళ్తామని విశ్వసిస్తున్నా.
@Jaemyung_Lee"
"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మిత్రుడికి ధన్యవాదాలు.
నేను మీతో ఏకీభవిస్తున్నా. రాబోయే ఏళ్లలో భారత్- ఇజ్రాయెల్ స్నేహం మరింత బలపడుతుందని విశ్వసిస్తున్నా.
@IsraeliPM
@netanyahu"
"ఇవాళ, గత కొన్ని రోజులుగా అన్ని వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలపటంతో నా హృదయం ఉప్పొంగిపోయింది. ప్రతి సందేశానికి నేను వ్యక్తిగతంగా స్పందించలేకపోవచ్చు. కానీ, ప్రతీ పలకరింపును నేను అపూర్వమైనదిగా భావిస్తాను.
భారత్‌కు సేవ చేసే, మన దేశ అభివృద్ధి ప్రయాణంలో సహకారం అందించే అవకాశం లభించటం అదృష్టంగా భావిస్తున్నా. కొన్నేళ్లుగా భారతదేశ ప్రజలు స్థిరత్వం, సుపరిపాలన, అభివృద్ధి కోసం మళ్లీమళ్లీ ఓటు వేశారు. వారి విశ్వాసమే నాకు అతిపెద్ద బలం. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసేందుకు, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మరింత అంకితభావంతో పనిచేస్తాను"
"మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు మిత్రమా.
భారత్-కెనడా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం.
@stephenharper"
"శుభాకాంక్షలు తెలిపిన శ్రీ రబీ లమీచానేకు ధన్యవాదాలు.
నేపాల్‌తో ఉన్న ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని మేం ఎంతో గౌరవిస్తాం. ఇరుదేశాల మధ్య బహుముఖ భాగస్వామ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మేం నిబద్ధతతో ఉన్నాం.
@hamrorabi"
"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన రిషి సునాక్‌కు ధన్యవాదాలు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు యూకేతో కలిసి పనిచేయటానికి భారత్ సిద్ధంగా ఉంది.
@RishiSunak"
"నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్‌కు ధన్యవాదాలు.
ఇటీవల నేను స్వీడన్‌లో పర్యటించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఆ పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాలకు మరింత ఊపునిచ్చింది. మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.
@SwedishPM"
"హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు ట్రంప్‌నకు ధన్యవాదాలు.
రెండు దేశాల ప్రయోజనాలు, ప్రపంచ సంక్షేమానికి భారత్-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయటానికి ఎంతో ఆసక్తితో ఉన్నాను.
@POTUS
@realDonaldTrump"
"నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేకు ధన్యవాదాలు. మన మధ్య స్నేహాన్ని నేను ఎంతో గౌరవిస్తాను. భారత్, భూటాన్ మధ్యనున్న ప్రత్యేక బంధానికి ఎంతో విలువనిస్తాను.
రాబోయే రోజుల్లో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మీతో కలిసి పనిచేస్తాం.
@tsheringtobgay"
"నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌కు ధన్యవాదాలు. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్-సింగపూర్ బంధాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కలిసి పనిచేయాలని కాంక్షిస్తున్నా. @LawrenceWongST”
"గౌరవపూర్వకమైన వ్యాఖ్యలు, హృదయపూర్వక శుభాకాంక్షలకు అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీకి ధన్యవాదాలు. భారత్, గయానా ప్రజల ప్రయోజనాల కోసం మన సహకారాన్ని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా. @presidentaligy”
***