ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తిరు భారతిరాజా జీ కన్నుమూత పట్ల విచారాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 11 JUN 2026 3:18PM by PIB Hyderabad

తిరు భారతిరాజా జీ కన్నుమూత పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. చలనచిత్ర రంగంలో శిఖరాయమాన వ్యక్తులలో ఒకరుగా ఆయన పేరు తెచ్చుకున్నారని, ఆయన సినిమాలు తమిళ చలనచిత్ర రంగంలో పెనుమార్పును తీసుకు వచ్చాయని ప్రధానమంత్రి అన్నారు.
మరీ ముఖ్యంగా పల్లె వాసుల జీవితాన్ని భారతిరాజా చిత్రించిన తీరు ప్రశంసనీయమైందని శ్రీ మోదీ తెలిపారు.  ‘‘ఈ దుఃఖ ఘడియలో భారతిరాజా కుటుంబానికి, అభిమానులకు కలిగిన శోకంలో నేను కూడా పాలుపంచుకుంటున్నాను. ఓమ్ శాంతి’’ అని ప్రధాని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘తిరు భారతిరాజా జీ కన్నుమూత అత్యంత దుఃఖాన్ని కలిగించింది. చలనచిత్ర రంగంలో శిఖరాయమాన వ్యక్తులలో ఒకరుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు తమిళ చలనచిత్ర రంగంలో పెనుమార్పును తీసుకు వచ్చాయి. పల్లె వాసుల జీవితాన్ని ఆయన చిత్రించిన తీరు ప్రశంసనీయం. ఈ దుఃఖ ఘడియలో ఆయన కుటుంబానికి, అభిమానులకు కలిగిన శోకంలో నేను కూడా పాలుపంచుకుంటున్నాను. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 2271703) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada