ప్రధాన మంత్రి కార్యాలయం
సంక్షేమ కార్యక్రమాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, విద్యాబోధన, ఆరోగ్య సంరక్షణ,
ప్రపంచ స్థాయిలో భారత్ భాగస్వామ్యం వంటి వివిధ రంగాల్లో
చోటుచేసుకున్న పెనుమార్పులను ప్రస్తావించిన సీనియర్ రాజనీతిజ్ఞుడు డాక్టర్ కరణ్ సింగ్ వ్యాసం...
ఆ వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 JUN 2026 10:06PM by PIB Hyderabad
సీనియర్ రాజనీతిజ్ఞుడు డాక్టర్ కరణ్ సింగ్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదవిలో 12 సంవత్సరాలను పూర్తి చేసుకున్న చరిత్రాత్మక ప్రగతి ప్రస్థానంపై అభిప్రాయాలను ఈ వ్యాసం తెలియజేసింది. దీనిలో సంక్షేమ కార్యక్రమాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, విద్యాబోధన, ఆరోగ్య సంరక్షణ తో పాటు ప్రపంచ స్థాయిలో భారత్ భాగస్వామ్యం వంటి వివిధ రంగాల్లో చోటుచేసుకున్న పెనుమార్పులను ముఖ్యంగా ప్రస్తావించారు. భారత్ భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కలగజేయడంతో పాటు పౌరులతో ప్రత్యక్ష అనుబంధాన్ని ఏర్పరుచుకోవడంలో కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీర్ఘకాల శ్రమ ఇమిడి ఉందని ఈ వ్యాసంలో వివరించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘పదవిలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చరిత్రాత్మక ప్రగతి ప్రస్థానంపై సీనియర్ రాజనీతిజ్ఞుడు డాక్టర్ కరణ్ సింగ్ తన అభిప్రాయాలను ఈ వ్యాసంలో వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, విద్యాబోధన, ఆరోగ్య సంరక్షణ తో పాటు ప్రపంచ స్థాయిలో భారత్ భాగస్వామ్యం వంటి వివిధ రంగాల్లో చోటుచేసుకున్న పలు మార్పులను వ్యాసంలో ముఖ్యంగా ప్రస్తావించారు. భారత్ భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కలగజేయడంతో పాటు పౌరులతో నేరుగా అనుబంధాన్ని ఏర్పరుచుకోవడంలోనూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీర్ఘకాల శ్రమ ఇమిడి ఉందని డాక్టర్ కరణ్ సింగ్ రాశారు’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2271540)
आगंतुक पटल : 2