హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మోదీ ప్రభుత్వానికి పేదల సంక్షేమమే అత్యంత ప్రధానాంశం: కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


పేదల సంక్షేమం కోసం పన్నెండేళ్లుగా చేపడుతున్న కార్యక్రమాలతో కోట్లాది పౌరులను బ్యాంకు సేవలకు, ఆర్థిక భద్రతకు, స్వయం ఉపాధి అవకాశాలకు అనుసంధానించిన ప్రభుత్వం

ప్రధాన ఆర్థిక స్రవంతిలో పేదలను భాగం చేయడంతో ‘వికసిత్ భారత్’కు బలమైన పునాది నిర్మితమవుతోంది

నాడు పోస్టు చేయడమైనది: 08 JUN 2026 12:55PM by PIB Hyderabad

పేదల సంక్షేమమే మోదీ ప్రభుత్వానికి అత్యంత ప్రధానాంశమని కేంద్ర హోంసహకార మంత్రి శ్రీ అమిత్ షా చెప్పారుగడచిన పన్నెండేళ్లలో పేదల కోసం అమలు చేసిన ఆహార పథకంపీఎం ఆవాస్జనధన్ లాంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది పౌరులను బ్యాంకు సేవలుఆర్థిక భద్రతస్వయం ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం అనుసంధానించిందని ఆయన తెలిపారు.

‘‘మోదీ ప్రభుత్వానికి పేదల సంక్షేమమే అత్యంత ప్రాధాన్యాంశంగత పన్నెండేళ్లలో పేదల సంక్షేమం కోసం అమలు చేసిన అన్న యోజనపీఎం ఆవాస్జనధన్ముద్ర రుణాలుపీఎం స్వనిధి లాంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది ప్రజలను బ్యాంకు సేవలుఆర్థిక భద్రతస్వయం ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం అనుసంధానించిందికనీస మౌలిక వసతులుసామాజిక భద్రతమెరుగైన జీవన ప్రమాణాలను అందించడం ద్వారా ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి దేశంలోని పేదలను తీసుకురావడం ద్వారా ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి అవసరమైన బలమైన పునాది నిర్మితమవుతోంది’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2270247) సందర్శకుల సూచీ సంఖ్య : : 63